Begin typing your search above and press return to search.

బెంగళూరు రేవ్ పార్టీలో ఆ 13 మంది మహిళలు ఎవరు?

ఇటీవల జరిగిన సంచలన విషయాల్లో బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఒకటని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

By:  Tupaki Desk   |   28 May 2024 3:53 AM GMT
బెంగళూరు రేవ్  పార్టీలో ఆ 13 మంది మహిళలు ఎవరు?
X

ఇటీవల జరిగిన సంచలన విషయాల్లో బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఒకటని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు, పలు పెర్ఫార్మెన్స్ లు, పోలీసులకు క్లారిటీలు వెరసి ఈ వ్యవహారం అటు ఇండస్ట్రీలోనూ, ఇటు బయటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది బ్లడ్ శాంపుల్స్ తీసుకుని పరీక్షలకు పంపడం తెలిసిందే! అయితే, ఆ పార్టీలో 13 మంది మహిళలను "క్వీన్ పిన్" ఏర్పాటు చేసినట్లు బలమైన పుకార్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఈ 13 మంది మహిళల వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.. బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు అని సంబోదిస్తూ కేసు నమోదు చేశారని అంటున్నారు.

ఇక ఈ 13 మంది మహిళలను అతిథులను ఎంటర్ టైన్ చేసేందుకు తీసుకెళ్లారని, ఈ రేవ్ పార్టీలో పాల్గొనేందుకు వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని చెబుతున్నారు. ఈ పార్టీకి హాజరైన మహిళల్లో ఒకరిద్దరు పేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి కానీ.. మిగిలిన వారు అంత ఫేమస్ పర్సనాలిటీలు కాదని, అందుకే గుర్తించడం కష్టం అయ్యిందని చెబుతున్నారు.

ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం తెరపైకి రావడం, హేమ పేరు వినిపించడంతో... ఆమె ఒక వీడియోను వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. తాను ఆ పార్టీలో లేనని, హైదరాబాద్ లో మరో చోట చిల్ అవుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే... వీడియో అనంతరం ఆమె అటెండెన్స్ పై బెంగళూరు పోలీసులు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏది ఏమైనా.. అతిథులను అలరించడానికి 13 మంది మహిళలు ఆ పార్టీకి వెళ్లారని.. దీనికోసం వారికి ఆ పార్టీ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారంటూ వస్తున్న కథనాలు మాత్రం వైరల్ గా మారాయి.