హైదరాబాద్ కి ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు!
ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ అర్బన్ డెవలప్ మెంట్ లో టాప్ 10 నగరాల్లో ఢిల్లీ, ముంబై, పూణె, బెంగళూరుతో పాటు హైదరాబాద్ నిలిచాయి.
By: Tupaki Desk | 1 Dec 2024 1:30 PM GMTదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితలో గత కొంతకాలంగా హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పాటు హైదరాబాద్ అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళ్తుందని అంటున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ కి సంబంధించి ఓ అసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఆసియా దేశాలు ఇటీవల కాలంలో పశ్చిమ దేశాలతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం 2033 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో 5 భారత నగరాలు ఉన్నాయనే విషయం తెరపైకి వచ్చింది. ఇది భారతదేశం వృద్ధి చెందుతున్న తీరును తెలుపుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ అర్బన్ డెవలప్ మెంట్ లో టాప్ 10 నగరాల్లో ఢిల్లీ, ముంబై, పూణె, బెంగళూరుతో పాటు హైదరాబాద్ నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు అగ్రస్థానం దక్కించుకోగా.. ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానల్లో నిలిచాయి. వియత్నాలోని హో చి మిన్హ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
ఇదే సమయంలో ఈ జాబితాలోని టాప్ 15 స్థానాల్లో 14 నగరాలు ఆసియాకు చెందినవి ఉండటం గమనార్హం. దీనికోసం సుమారు 230 నగరాలపై జనాభా, వ్యక్తిగత వృద్ధి, జీడీపీలో పెరుగుదల, స్థిరమైన అభివృద్ధి లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని సావిల్స్ గ్రూపు గ్రోత్ ఇండియా సర్వే చేసింది.
సాంకేతికతపై ప్రపంచం దృష్టి సారించడంతో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. దానివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతలకు ప్రజానికం షిఫ్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో... బెంగళూరు, హైదరాబాద్, పూణేలు టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వేగంగా వృధిని సాధిస్తాయని సర్వేలో అంచనా వేశారు.
2033 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్-10 నగరాలను ఇప్పుడు చూద్దాం...!
1. బెంగళూరు - భారత్
2. హోచి మిన్హ్ - వియాత్నాం
3. ఢిల్లీ - భారత్
4. హైదరాబాద్ - భారత్
5. ముంబై - భారత్
6. షెంజెన్ - చైనా
7. గాంగ్జౌ - చైనా
8. సుజో - చైనా
9. రియాద్ - సౌదీ అరేబియా
10. మనీలా - ఫిలీప్పీన్స్