Begin typing your search above and press return to search.

ట్రెండింగ్... లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు దేవుని ఆగ్రహ ఫలితమా?

సుమారు రెండు వారాలుగా అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యంత ఖరీదైన భవనాలు, ధనవంతులు ఉండే ప్రాంతంగా చెప్పే లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు దహించివేస్తోంది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 1:30 PM GMT
ట్రెండింగ్...  లాస్  ఏంజెలెస్  కార్చిచ్చు దేవుని ఆగ్రహ ఫలితమా?
X

సుమారు రెండు వారాలుగా అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యంత ఖరీదైన భవనాలు, ధనవంతులు ఉండే ప్రాంతంగా చెప్పే లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు దహించివేస్తోంది. అగ్నిమాపక సిబ్బంది అలుపెరగకుండా అహర్నిశలూ విశ్వప్రయత్నాలు చేస్తూన్నా.. వేగంగా వీస్తున్న గాలుల నుంచి ప్రతికూలత ఏర్పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం 'లాస్ ఏంజెలెస్ పరిస్థితికి దేవుని ఆగ్రహమే కారణం!' అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... దేవుడు ఉన్నాడా..? ఈ సృష్టిని దేవుడే సృష్టించాడా..? ఆయన మనిషి జీవించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రకృతినే.. అతడు గాడి తప్పితే దండించడానికి ఆయుధంగానూ ఉపయోగిస్తాడా..? తాజాగా లాస్ ఏంజెలెస్ లో జరుగుతున్న దమనకాండ దేవుని ఆగ్రహ ఫలితమేనా..? దేవుడు ఆశీర్వదించిన దేశంగా చెప్పుకునే అమెరికాలో దేవునిపై కొంతమంది చేసిన వ్యాఖ్యల ఫలితమే ఈ పరిస్థితా..? అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ శతాబ్ధ కాలంలో అమెరికా ఎన్నో కార్చిచ్చులను చూసింది! అటవీ ప్రాంతంలో మంటలు మొదలవ్వడం.. అవి తీవ్రమైన గాలుల ఫలితంగా తీవ్రరూపం దాల్చడం.. ఈ సమయంలో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది విమానాలు, హెలీకాప్టర్ల సహాయం కూడా తీసుకుని వాటిని అదుపుచేయడం. దాదాపు ప్రతీ ఏటా ఏదో ఒక మూల జరుగుతుండే విషయమే! అయితే... తాజా కార్చిచ్చు అందుకు పూర్తీ భిన్నంగా ఉందనే చర్చా నడుస్తుంది.

ఈ సందర్భంగా... బైబిల్ లో సొదోమ, గొమొర్రా అనే రెండు నగరాలను గుర్తు చేసుకుంటుంది క్రైస్తవ సమాజం. నాడు ఆ రెండు నగరాల్లోని ప్రజలు తీవ్రస్థాయిలో అదుపుతప్పడంతో దేవుని ఉగ్రతకు గురికావాల్సి వచ్చిందని.. వాటిని అగ్ని, గందకాలతో దేవుడు దహించివేశాడని.. ఇప్పుడు లాజ్ ఏంజెలెస్ లో జరుగుతున్నదీ అదే తరహా పరిస్థితిలా కనిపిస్తుందనే చర్చ క్రైస్తవ సమాజంలో జరుగుతుంది.

ఈ తరహా చర్చ తెరపైకి రావడానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇటీవల హాలీవుడ్ లో సినిమాలకు సంబంధించి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రపంచంలోని చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి మాట్లాడుతూ.. తమది దేవుడు లేని నగరం అని, దేవుడు లేని స్వర్గమని, తమ నగరానికి దేవుని అవసరం లేదని అన్నారని తెలుస్తోంది.

అయితే... సదరు యాంకర్ అలా మాట్లాడిన రెండు రోజుల్లోపే కార్చిచ్చు మొదలవ్వడం, అత్యంత ధనిక నగరం, అందమైన నగరంగా చెప్పుకునే లాస్ ఏంజెలెస్ కాలి బూడిదైపోవడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ కార్చిచ్చు వల్ల సుమారు 12,000 కుపైగా నిర్మాణాలు బూడిదవ్వగా.. కొన్ని వేల ఎకరాలు నాశనం అయ్యాయి. ఇక సుమారు రూ.12 నుంచి 15 లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో తాజా స్థితిని, నగరం మొత్తం కార్చిచ్చు వల్ల ధ్వంసమైన పరిస్థితిని గమనించిన నిపుణులు... ఈ నగరం తేరుకుని, ఉన్నంతలో పూర్వ వైభవం సంతరించుకుని, ఇక్కడి ప్రజలు నాటి రోజులు చూడటానికి కనీసం దశాబ్ధ కాలం పడుతుందని అంచనా వేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సొదోమ, గొమొర్రా పట్టణాలను గుర్తు చేసుకుంటుంది క్రైస్తవ సమాజం అని అంటున్నారు.

ఏది ఏమైనా... దేవుడు ఉన్నాడా.. లేడా.. అనేది పెద్ద చర్చ! సరైన ముగింపుకు చాలా మంది రాలేని చర్చ అని అంటారు! అందుకు వారి అహం కొంత అడ్డొస్తే... అర్ధజ్ఞానానికీ, అజ్ఞానానికీ కొట్టిమిట్లాడుతూ తాము జ్ఞానులమని భ్రమపడే తత్వం మరో కొంత కారణం అయ్యి ఉండొచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా... లాస్ ఏంజెలెస్ త్వరగా బయటపడాలని, వేగంగా కోలుకోవాలని కోరుకుందామ్!!