Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో డ్రగ్స్... గోదావరి జిల్లాలకూ లింకులు!

అవును... తాజాగా గోవా నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్ తరలించి విక్రయాలు జరుపుతున్న నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు

By:  Tupaki Desk   |   10 Oct 2023 4:15 AM GMT
హైదరాబాద్ లో డ్రగ్స్... గోదావరి జిల్లాలకూ లింకులు!
X

గతకొంతకాలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారలు కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఏ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చినా అందులో సినీజనాలకు లింక్స్ ఉంటున్నాయనే చర్చ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ డ్రగ్స్ లింకులు గోవాకే కాదు సుమా.. గోదావరి జిల్లాలకూ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... తాజాగా గోవా నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్ తరలించి విక్రయాలు జరుపుతున్న నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో వారి వద్ద నుంచి సుమారు 32 గ్రాముల కొకైన్‌ తో పాటు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోన్నారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే... ఈ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్న నలుగురు వ్యక్తులూ... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారని తెలుస్తుంది. దీంతో గోదావరి జిల్లాలో ఒక్కసారిగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. వీరి వ్యాపారం హైదరాబాద్ వరకే పరిమితమైందా... లేక, గోదావరి జిల్లాల్లోకీ వచ్చేసిందా అనేది చర్చనీయాంశం అయ్యింది.

వీరిలో ప్రధాన నిందితుడు సులభంగా డబ్బులను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అమ్మకాలను జరుపుతున్నారని వెల్లడిస్తున్న పోలీసులు... మిగిలిన చిరు వ్యాపారులైన నిందితులకు కొకైన్‌ ను డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. దీంతో ఈ నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ కేసులో రాజమండ్రికి చెందినట్లు చెబుతున్న ప్రధాన నిందితుడు.. గతంలో కూడా డ్రగ్స్ విక్రయాలను జరిపిన్నట్లు పోలీసులు గుర్తించారంట. మరోపక్క... మదాపూర్ డ్రగ్స్ కేసులోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీనటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ రోజు నవదీప్ ను విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్ తో పాటు మనీలాండరింగ్ కోణంలోనూ ఈడీ విచారణ చేపట్టనుందని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాజమండ్రి యువకులతో లింకులున్న డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.