మూడు పార్టీల మీద గోదావరి జనాలు ఏమంటున్నారు..?
తాజాగా చూస్తే కొన్ని యూ ట్యూబ్ చానల్స్ వారు చేసిన సర్వేలు కూడా ఇపుడు ప్రచారంలో ఉన్నాయి. అవి కొంత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
By: Tupaki Desk | 19 Aug 2023 3:00 AM GMTఏపీలో అత్యంత కీలకమైన రీజియన్ గా గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో పవర్ ని అందించేదిగా లేక రాజకీయాల్లో మార్పు చేసేదిగా ఈ రీజియన్ కి పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే పొలిటికల్ గేమ్ చేంజర్ గా గోదావరి జిల్లాలను జనాలు చూస్తారు. రాజకీయ పండిట్స్ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకుంటారు.
ఇక ఏపీలో చూస్తే ఎన్నికలు దగ్గరలోకి వస్తున్నాయి. ఏడెనిమిది నెలలలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో గోదావరి జిల్లాల ప్రజానీకం పాత్ర ఎలా ఉండబోతోంది. ఏ ఏ వర్గాలు ఏ పార్టీకి సపోర్టుగా నిలుస్తాయన్న దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి సర్వేలు కూడా ఉన్నాయి. తాజాగా చూస్తే కొన్ని యూ ట్యూబ్ చానల్స్ వారు చేసిన సర్వేలు కూడా ఇపుడు ప్రచారంలో ఉన్నాయి. అవి కొంత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
గోదావరి జిల్లాలను సంక్షేమ పధకాలు కట్టిపడేస్తున్నాయని పలు సర్వేలలో యునానిమస్ గా వెలువడుతున్న అభిప్రాయం. అదే సమయంలో కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పనిచేస్తోంది అని అంటున్నారు. కాపులలోనే చూసుకుంటే యూత్ అంతా జనసేనకు జై కొడుతున్నారని ఒక ఫీవర్ గా అది ఉందని అంటున్నారు.
ఇక ఇదే క్యాస్ట్ లో మధ్య వయస్కులు అంతా టీడీపీ బాటన నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వీరిలో వివిధ వృత్తుల వారు, ఉద్యోగ వ్యాపారస్థులు, సమాజంలో కీలకమైన కార్యకలాపాల్లో ఉన్న వారు టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక అరవైలు దాటిన జనాభా అంతా వైసీపీకి జై కొడుతోంది. వారంతా వైసీపీ పధకాలు బాగున్నాయని జగనే మళ్ళీ రావాలని అంటున్నారు. దాంతో ఒక కులం ఓట్లు గుత్తమొత్తంగా ఒకే పార్టీకి పడే చాన్స్ అయితే ఇక్కడ లేదని అర్ధం అవుతోంది అంటున్నారు.
అదే విధంగా కులాలతో పాటు ప్రతీ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ ని పెడితే ఆ అభ్యర్ధి ఫ్యాక్టర్ కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు. అంటే పార్టీలు కులాలతో పాటుగా అభ్యర్ధి కూడా ఈసారి అత్యంత కీలకం అవుతారు అని అంటున్నారు. విడిగా పోటీ చేస్తే వైసీపీ టీడీపీల మధ్య హోరా హోరీ పోరు సాగుతుంది అని అంటున్నారు మొత్తం ఇరవై నియోజకవర్గాలలో చెరి సగం లలో వైసీపీ టీడీపీకి బలాలు ఉన్నాయని, గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మిగిలిన పద్నాలుగు సీట్లలో జనసేనకు మూడు నుంచి నాలుగు సొంతంగా గెలుచుకునే స్తోమత ఉంది మిగిలిన పదింటిలో భీకరమైన పోరు సాగుతుంది అని అంటున్నారు.
జనసేన గెలిచే సీట్లలో భీమవరం, పిఠాపురం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలను చెబుతున్నారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాల మీద అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈసారి ఎటువంటి ప్రభంజనం ఏ పార్టీ వైపుగా లేకపోవడం అధికార పార్టీకి ప్లస్ అవుతోంది. వైసీపీని ఎందుకు దించేయాలన్న ఆలోచన ఒక వైపు మొత్తం ప్రజలలో ఉంటే తమ కులానికి సీఎం కావాలన్న కోరిక కాపులలో ఉంది. ఇక టీడీపీ గ్రాఫ్ గతం కంటే పెరిగింది కానీ ఎన్నో సార్లు చూసేసిన పార్టీగా మోజు అయితే పెద్దగా లేదని అంటున్నారు. మొత్తం ఈ పరిణామాల మధ్య గోదావరి జిల్లాల ప్రజల తీర్పు ఈసారి విలక్షణంగా ఉండబోతోంది అని అంటున్నారు.