Begin typing your search above and press return to search.

పాక్ పంట పండుతోందా... దబిడి దిబిడేనా ?

అత్యంత పేద దేశంగా పాక్ మారిపోతోందని ఇక కోలుకోవడం కష్టమని కూడా అంతా అనుకున్నారు. అలాంటి పాక్ కి ఇపుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చి పడుతోంది అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Jan 2025 3:44 AM GMT
పాక్ పంట పండుతోందా... దబిడి దిబిడేనా ?
X

పాకిస్థాన్ అంటే నేరాలు ఆకలి. అశాంతి ఇలా చాలా విషయాలు చెప్పుకుంటారు. చాలా కాలంగా చూస్తే పాక్ లో ఆర్ధిక పరిస్థితి కూడా ఏ మాత్రం బాగు లేదు. సహాయం చేయాల్సిన దోస్తీ దేశాలు కూడా ఎంతో కొంత ఇచ్చి ముఖం తిప్పుకున్న పరిస్థితి శ్రీలంక తరువాత పాక్ ఆర్ధికంగా పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని వార్తలు వచ్చాయి.

అత్యంత పేద దేశంగా పాక్ మారిపోతోందని ఇక కోలుకోవడం కష్టమని కూడా అంతా అనుకున్నారు. అలాంటి పాక్ కి ఇపుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చి పడుతోంది అంటున్నారు. ఆ దేవుడే వరం ఇచ్చినట్లుగా బంగారం లాంటి చాన్స్ ఎదురొచ్చింది అంటున్నారు. ఇంతకీ పాక్ కి దక్కిన ఆ లక్ ఏంటి అంటే పాకిస్థాని జియలాజికల్ సర్వే సంస్థ ఏకంగా 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను కనుగొంది అన్నది లేటెస్ట్ న్యూస్.

దీని విలువ చూస్తే అక్షరాల ఆరు వందల బిలియన్ పాకిస్థాన్ రూపాయలుగా చెబుతున్నారు. సింధు నదిలో ఈ నిల్వలు ఉన్నట్లుగా కనుగొన్నారు. కేవలం సింధు నది మీదనే కాకుండా చాలా చోట్ల పాకిస్థాను ఇలా బంగారం నిల్వలను కనుగొందని ఈ దెబ్బతో పాకిస్తాన్ కరువు అంతా తీరిపోతుందని అంటున్నారు.

పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఉన్న రెకో డిక్ గనిలో బంగారం రాగి నిల్వలు ఉన్నాయని అంటున్నారు. ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద బంగారు నిల్వగా ఉన్న దీని నుంచి కూడా బంగారం నిల్వలను సేకరించడానికి వెలికి తీయడానికి పాకిస్థాన్ ప్రక్రియను ఇప్పటి నుంచే మొదలెట్టింది.

ఇలా పాకిస్తాన్ లోని బంగారు గనుల నిల్వల మీద ప్రపంచ దేశాలు కన్ను వేశాయి. అవన్నీ ఇపుడు పాకిస్థాన్ తో చర్చలు జరుపుతున్నాయి. కెనడియన్ కంపెనీ అయితే ఇప్పటికే పాక్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది అని వార్తలు వస్తున్నాయి.

ఇలా తమకు తమ దేశానికి ఆమోదయోగ్యమైన ఒప్పందాలు కుదిరితే ఈ బంగారు గనుల వెలికితీతను ఆయన దేశాల కంపెనీలకు పాక్ అప్పగిస్తుంది. ఈ మొత్తం గనుల వెలికి తీర ప్రాసెస్ కంప్లీట్ అయి పాక్ చేతికి కరెన్సీ వచ్చేసరికి మూడేళ్ళు పడుతుందని అంటున్నారు. అంటే రానున్న మూడేళ్ళలో పాక్ దరిద్రం అంతా పోయి దశ పడుతుందని అంటున్నారు.

అసలే పేద దేశంగా ఉన్నపుడే పాక్ ని ఎవరూ పట్టలేకపోయారు. ఇపుడు డబ్బుతో కూడిన పాక్ ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మరి పాకిస్తాన్ కి డబ్బు వచ్చి సంపన్న దేశంగా మారితే ఎలాంటి పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటాయో చూడాల్సిందే అంటున్నారు. తన దోస్తీ దేశాలతో పాటు దాయాది దేశాలు ప్రత్యర్ధి దేశాల పట్ల పాక్ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సి ఉంది.