"స్వర్ణాంధ్ర @ 2047" విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ... 10 సూత్రాలివే!
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 11:13 AM GMT"స్వర్ణాంధ్ర @ 2047" విజన్ డాక్యుమెంట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. "పది సూత్రాలు - ఒక విజన్" పేరిట డాక్యుమెంట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు.
అవును... "స్వర్ణాంధ్ర @ 2047" విజన్ డాక్యుమెంట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా... జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... తెలుగు జాతీ ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనేదే తన సంకల్పం అని.. ఆ సంకల్పంతోనే ముందుకువెళ్తున్నామని అన్నారు. ఇదే సమయంలో దేశంలోనే ఎపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందని తెలిపారు.
ఈ క్రమంలో 2047 నాటికి 42 వేళ డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పిన చంద్రబాబు... విజన్ డాక్యుమెంట్ కోసం సుమారు 17 లక్షల మంది తమ ఆలోచనలను పంచుకున్నారని చెప్పడం గమనార్హం.
ఇదే సమయంలో... నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారని చెప్పిన చంద్రబాబు 2047లో భాగంగా.. ప్రతీ ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలని అన్నారు. ఈ సందర్భంగా పేదరికం లేని సమాజం తయారు కావాలని.. ఆర్థిక అసమానతలు తగ్గించాలని చంద్రబాబు తెలిపారు.
ఇక ప్రధానంగా... పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటిటికీ నీరు, రైతు-వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి - ఇందనాల వ్యవయ నియంత్రణ, అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర వంటి 10 సూత్రాలతో విజన్ - 2047 రూపొందించారు.