1200 ఏళ్ల నాటి సమాధిలో ఎన్ని నిధి నిక్షేపాలు లభించాయో తెలుసా?
అమెరికాలో ఇటీవల వెలువడిన తవ్వకంలో పలు కొత్త విషయాలు బయటపడ్డాయి. దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో బయటపడిన అవశేషాలు గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది.
By: Tupaki Desk | 11 March 2024 10:12 AM GMTప్రపంచంలో ఎన్నో నాగరికతలు బయటపడ్డాయి. సింధూలోయ నాగరికత మన దేశంలో బయటపడితే ఇండోనేషియా నాగరికతతో పాటు ఈజిప్టు దేశాల్లో కూడా చాలా వరకు నాగరికతలు వెలువడ్డాయి. దీంతో వారి జీవన విధానం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం కూడా పలు విషయాలు మనకు తెలియనివి ఇంకా భూముల్లోనే నిక్షిప్తం అయి ఉన్నాయి. అప్పటి ప్రజల జీవన గమనం గురించి తెలుసుకునే వరకు మనకు వారి గురించి తెలియదు.
అమెరికాలో ఇటీవల వెలువడిన తవ్వకంలో పలు కొత్త విషయాలు బయటపడ్డాయి. దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో బయటపడిన అవశేషాలు గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. సుమారు 12వ శతాబ్ధం నాటి సమాధి తవ్వుతుండగా భారీగా బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో అందరు అవాక్కయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి 110 మైళ్ల దూరంలో ఎల్ కానో, అర్కియాలజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది.
బంగారంతో పాటు నిధి నిక్షేపాలు కొందరి చనిపోయిన అవశేషాలు లభించాయి. సమాధిలో అప్పటి తెగకు చెందిన వారినే పాతిపెట్టారని ప్రతీతి. ఇందుల దాదాపు 32 చనిపోయిన వారి అవశేషాలు లభించడం గమనార్హం. బంగారు శాలువా, ఆభరణాలు, తిమింగలం పళ్లతో చేసిన చెవిపోగులు, బెల్టులు లాంటివి దొరికినట్లు పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ జూలియా మాయో తెలిపారు. అమెరికాలో యూరోపియన్ల రాకకు ముందు జీవించిన వారి తెగలగా అనుమానిస్తున్నారు.
అప్పటి ఆచారం ప్రకారం ప్రభువు మరణిస్తే అతడితో పాటు కొంతమందిని బలిచ్చి వారితో పాటు విలువైన వస్తువులు, ఆభరణాలు పాతిపెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే వారిని అలా సమాధి చేసి వాటిని అందులో ఉంచినట్లు తెలుస్తోంది. సమాధిలో బయటపడిన నిధి నిక్షేపాలు చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి వారి జీవన విధానానికి సంకేతంగా చెబుతున్నారు. బయటపడిన నిధి విలువ ఎంత విలువైనదో లెక్క గడుతున్నారు.
అమెరికాలో వెలుగు చూసిన ఈ సంపద అక్కడి ప్రజల జీవన విదానాన్ని తెలియజేసింది. అప్పటి వారి ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టింది. వారు వాడిన వస్తువులు ఎలా ఉంటాయో తెలిసింది. అవి అత్యంత ఖరీదైన వస్తువులుగా గుర్తించారు. ఇంకా ఏమేం బయటపడతాయో తెలియడం లేదని అంటున్నారు. పనామా మంత్రిత్వ శాఖ తవ్వకాలు జరుపుతోంది. బంగారు నిక్షేపాలు విరివిగా లభించడం మామూలు విషయం కాదు. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.