Begin typing your search above and press return to search.

జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై గోనె ప్రకాశ్ జోస్యం వైరల్!

దీనికి తోడు రోజు రోజుకీ పెరుగుతున్న.. పార్టీని వీడుతున్న కీలక నేతలు, సీనియర్ నేతల జాబితా. ఈ సమయంలో గోనె ప్రకాశ్ రావు కీలక జోస్యం చెప్పారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 6:38 AM GMT
జగన్  పొలిటికల్  ఫ్యూచర్  పై గోనె ప్రకాశ్  జోస్యం వైరల్!
X

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చాలా మంది ఊహించని రీతిగా అన్నట్లుగా 11 సీట్లకు పరిమితమైంది. మంత్రులు, కీలక నేతలు కనిపించకుండా పోయిన పరిస్థితి! దీనికి తోడు రోజు రోజుకీ పెరుగుతున్న.. పార్టీని వీడుతున్న కీలక నేతలు, సీనియర్ నేతల జాబితా. ఈ సమయంలో గోనె ప్రకాశ్ రావు కీలక జోస్యం చెప్పారు.

అవును... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమెల్యేగా, ఆర్టీసీ ఛైర్మన్ గా పని చేసిన గోనె ప్రకాశ్ రావు తదైన శైలిలో రాజకీయ విశ్లేషణలూ చేస్తుంటారు. ఈ సమయంలో గత ఎన్నికలకు ముందు తాను ఏపీ రాజకీయాల విషయంలో చెప్పిన జోస్యం నెరవేరిందని.. బీజేపీ - టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తారని తాను ముందే చెప్పానని చెప్పుకొచ్చారు!

ఇక తాజాగా జగన్ పరిస్థితి బాగా లేదని.. అవంతి శ్రీనివాసే కాదు చాలా మంది నేతలు వైసీపీని వీడబోతున్నారని గోనె జోస్యం చెప్పారు. ఇదే సమయంలో... బాలినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తితో పాటు రాజ్యసభ సభ్యులు, ఇంకా చాలా మంది వైసీపీని వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని గోనె చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పటికి జగన్ కు ఉన్న 10 ఎమ్మెల్యేలలో 4 నుంచి 5 గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉందని గోనె వెల్లడించారు. జగన్ ఓడిపోయినప్పటికీ ఇంకా ఏదో భ్రమలో ఉన్నారని.. తిరిగి అధికారంలోకి వస్తానని అన్నారు. గతంలో తాను చేసిన పాలసీలను సమర్ధించుకుంటున్నారని అన్నారు.

ఆయన హయాంలో ఇసుక, మద్యం పాలసీల్లో అంతులేని అవినీతి జరిగిందని.. ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఇక ఇప్పుడు విద్యుత్ ధరలు బాగా తగ్గుతున్నాయని.. అయినప్పటికీ అదానీతో 2 రూపాయలుపైగా అగ్రిమెంట్ చేసుకున్నారని.. దాని వల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం అని తెలిపారు. జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.

ఏ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ పెన్సింగ్ వేసుకోలేదని.. ప్రధాని కూడా వేసుకోలేదని.. ఏ ముఖ్యమంత్రీ చెట్లు కొట్టేయలేదని, పరదాలు కట్టుకోలేదని.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు. మరోపక్క జగన్ పై కేసులు ఫాస్ట్ ట్రాక్ చేయబడుతున్నాయని అన్నారు!!

జగన్ కు చాలా దగ్గరవారు కూడా విడిచి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని.. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. అయితే.. ఇది ఆయన కోరికా.. లేక, జరుగుతున్న పరిణామాలను బట్టి వేస్తున్న అంచనా అనేది తెలియాల్సి ఉంది! ఏది ఏమైనా.. గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!