Begin typing your search above and press return to search.

రేపటి నుంచి 5 నెలలు.. పెళ్లి ముహుర్తాలకు కొదవలేదు బాస్

సంబంధం కుదిరి.. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత కూడా మంచి ముహుర్తాలు లేకపోతే.. ఆ టైం వరకు ఆగాల్సిందే.

By:  Tupaki Desk   |   30 Jan 2025 6:30 AM GMT
రేపటి నుంచి 5 నెలలు.. పెళ్లి ముహుర్తాలకు కొదవలేదు బాస్
X

సంబంధం కుదిరి.. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత కూడా మంచి ముహుర్తాలు లేకపోతే.. ఆ టైం వరకు ఆగాల్సిందే. అలాంటి నిరీక్షణకు రేపటి (జనవరి 31) నుంచి తెర పడనుంది. రేపటి నుంచి రానున్న ఐదు నెలల వరకు బ్యాక్ టు బ్యాక్ ముహుర్తాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలుకానుంది.

ఈ ఏడాది మొత్తంలో అత్యధిక పెళ్లిళ్లకు ఇదే అతి మంచి కాలంగా చెబుతున్నారు. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం కావటంతో మాఘాది పంచకం అంటే మాఘ.. ఫాల్గుణ.. చైత్ర.. వైశాఖ.. జేష్ట మాసాల్లో పెళ్లి శుభకార్యాల ముహుర్తాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పాల్గుణ మాసంలో మార్చి 18 నుంచి 28 వరకు మాత్రం ముహుర్తాలు లేవు. కారణం.. శుక్ర మౌఢ్యమి రావటంతో ఇలాంటి పరిస్థితి.

శ్రీరామనవమి తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది. ఉగాది లోపు ఎక్కువ వివాహాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ పెళ్లి సం23 వరకు మే 23 వరకు ఉండనుంది. చివరి మహుర్తం మాత్రం మే 28గా చెబుతున్నారు. ఇది జ్యేష్ట మాసంలో రానుంది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా మార్కెట్ మంచి ఉత్సాహంగా ఉండటంతో పాటు.. దాదాపు 25 రంగాలకు పైనే ఉపాధి లభిస్తుంది. లక్షలాది మందికి రాబడికి మార్గంగా మారుతుంది. సో.. పెళ్లికి మంచి ముహుర్తాలు పెళ్లి చేసుకునే వారికి మాత్రమే కాదు.. పలు రంగాల వారికి స్వీట్ న్యూస్ గానే చెప్పాలి.

పెళ్లికి మంచి ముహుర్తాలు నెలల వారీగా..

జనవరి: 31

ఫిబ్రవరి: 2, 6, 7, 8,న 12, 13, 14, 15, 16, 20, 22, 23

మార్చి: 1, 2, 6, 7, 12, 14, 15, 16

ఏప్రిల్: 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23, 29, 30.

మే: 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 28.