Begin typing your search above and press return to search.

వైవీ సుబ్బారెడ్డికి గుడ్ న్యూస్!... సర్కార్ కు కీలక ఆదేశాలు!

అవును... తన భద్రతను 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1 కు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   25 July 2024 7:30 AM GMT
వైవీ సుబ్బారెడ్డికి గుడ్  న్యూస్!... సర్కార్  కు కీలక ఆదేశాలు!
X

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం.. ఊహించని స్థాయిలో అన్నట్లుగా వైసీపీ ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం పలు కీలక నిర్ణయలు తీసుకొంటోంది. ఈ నేపథ్యంలో.. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల భద్రతను ఉపసంహరిస్తోందని అంటున్నారు.

ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో భారీ భద్రత అడుమ కొనసాగిన నేతలకు వరుసగా భద్రతను ఉపసంహరించుకుంటుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారి భద్రతను తగ్గిస్తున్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ సమయంలో... హైకోర్టును ఆశ్రయించిన సుబ్బారెడ్డికి గుడ్ న్యూస్ వినిపించింది. అవును... తన భద్రతను 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1 కు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో భాగంగా తనకు మునుపటిలాగానే 2 ప్లస్ 2 భద్రత కల్పించాలని కోరారు.

ఈ సమయంలో తన వాదన వినిపించిన ప్రభుత్వం... సుబ్బారెడ్డి భద్రతకు ఎలాంటి ముప్పూ లేదని, ముప్పు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని వాదించింది. అయితే. ఎంపీగా ఆయనకు 2 ప్లస్ 2 భద్రత అవసరమని వైవీ సుబ్బారెడ్డి న్యాయవాదులు వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డికి భద్రత కొనసాగించాలని ఆదేశించింది.

ఇందులో భాగంగా... నాలుగు వారాల పాటు 2 ప్లస్ 2 భద్రతను సుబ్బారెడ్డికి కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో... ఏపీ పోలీసులు సుబ్బారెడ్డికి గతంలో ఉన్న 2 ప్లస్ 2 భద్రతను కొనసాగించాల్సి ఉంటుంది. నాలుగు వారల తర్వాత ఈ వ్యవహారంపై హైకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది సుబ్బారెడ్డికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి!