వైరల్... జో బైడెన్ చేసిన నేరమేమిటి గూగుల్...?
వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు ఈ శతాబ్ధంలో 2001 నుంచి 2009 వరకూ రెండు దఫాలు జార్జ్ డబ్ల్యూ బుష్.. 2009 - 2017 మధ్య రెండు సార్లు బరక్ ఒబామా అమెరికాను పరిపాలించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jan 2025 11:30 PM GMTఅమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా 45వ అధ్యక్షుడిగానూ ట్రంప్ పనిచేశారు. ఈ మధ్యలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. 2021 నుంచి 2025 మధ్య పూర్తి టెర్మ పాలించారు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే కానీ.. గూగుల్ మాత్రం మరిచిపోయింది!
అవును... తాజాగా నెట్టింట ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ట్రంప్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయగా.. అప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నది జోబైడెన్ అనే సంగతి దాదాపు ప్రపంచమంతా తెలుసు! అయితే.. ఈ విషయం గూగుల్ కి తెలియకపోవడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు ఈ శతాబ్ధంలో 2001 నుంచి 2009 వరకూ రెండు దఫాలు జార్జ్ డబ్ల్యూ బుష్.. 2009 - 2017 మధ్య రెండు సార్లు బరక్ ఒబామా అమెరికాను పరిపాలించిన సంగతి తెలిసిందే. అనంతరం 2017 - 2021 మధ్య డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ప్రెసిడెంట్ అయ్యారు.. అమెరికాను పాలించారు.
ఈ విషయాలన్నీ కరెక్ట్ గా చెబుతున్న గూగుల్ సెర్చ్... 2021 - 2025 మధ్య జోబైడెన్ యూఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న విషయాన్ని మాత్రం మిస్ చేసింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ గుర్తించి, దానికి సంబంధించిన మొబైల్ సెర్చ్ స్క్రీన్ షాట్స్ తీసి, నెట్టింట పోస్ట్ చేశారు. "లిస్ట్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్స్ ఇన్ ఆర్డర్" అని సెర్చ్ చేస్తే.. ఆ రిజల్ట్ లో బైడెన్ తప్పిపోయారని పోస్ట్ పెట్టారు.
దీంతో... ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే ఎలాన్ మస్క్ ఎలాంటి విషయం మరిచిపోయినా పర్లేదు.. సంతోషంలో అయ్యి ఉంటుందని సరిపెట్టుకొవచ్చు కానీ.. గూగుల్ కూడా మరిచిపోతే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే... ఈ విషయం తెరపైకి వచ్చిన కాసేపటి తర్వాత గూగుల్ మేల్కొంది! 2021-2025 మధ్య అమెరికా ప్రెసిడెంట్ ఎవరో వెతికి పెట్టింది!