గూగుల్ విల్లో చిప్.. దీని గురించి తెలిస్తే అవాక్కే!
ఇంతకూ ఈ చిప్ సాధించిన సక్సెస్ ఎంత పెద్దదన్న విషయాన్ని సాంకేతికంగా చెప్పాల్సి వస్తే ఒకటి పక్కన పాతిక సున్నాలు పెట్టినప్పుడు వచ్చే సంఖ్యను 10సెప్టిలియన్స్ గా వ్యవహరిస్తారు.
By: Tupaki Desk | 11 Dec 2024 4:19 AM GMTఅక్షరాల అద్భుతాన్ని క్రియేట్ చేసింది గూగుల్. ఇప్పటికే అందుబాటులో ఉన్న కంప్యూటర్లు అన్ని కలిసి ఒక సమస్యను పరిష్కరించానికి వేల కోట్ల ఏళ్లు పట్టే దానిని గూగుల్ డెవలప్ చేసిన ఒక చిప్ కేవలం నిమిషాల సమయాన్నే తీసుకున్న వైనం టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనంగా మారింది. గూగుల్ డెవలప్ చేసిన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ను విల్లోగా పిలుస్తున్నారు. శాంతా బార్బరాలో గూగుల్ కు చెందిన ల్యాబ్ లో దీన్ని డెవలప్ చేశారు. అత్యంత కఠినమైన గణిత సమస్యలకు కేవలం ఐదు నిమిషాల్లోపే సాల్వ్ చేసిన వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంతకూ ఈ చిప్ సాధించిన సక్సెస్ ఎంత పెద్దదన్న విషయాన్ని సాంకేతికంగా చెప్పాల్సి వస్తే ఒకటి పక్కన పాతిక సున్నాలు పెట్టినప్పుడు వచ్చే సంఖ్యను 10సెప్టిలియన్స్ గా వ్యవహరిస్తారు. విశ్వం వయసు.. ఈ సంఖ్య కంటే ఎక్కువ. మూడు దశాబ్దాలుగా క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అంశంలో సూపర్ కంప్యూటర్ లో సాల్వ్ కాకుండా ఒక సమస్యను ఈ విల్లో చిప సులువుగా సమాధానం కనిపెట్టిన వైనం రికార్డు బ్రేకింగ్ గా మారింది. టెక్ ప్రపంచంలో అతి పెద్ద విప్లవంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
సంప్రదాయ కంప్యూటర్లతో పోలిస్తే మెరుపు వేగంతో సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్ చిప్ లు పరిష్కరిస్తాయి. ఈ చిప్ మీద గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. క్యూబిట్స్ ను ఎక్కువగా వినియోగించటం ద్వారా తప్పులను తగ్గించే సరికొత్త కంప్యూటింగ్ చిప్ విల్లోను తాను ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ముప్ఫై ఏళ్లుగా పరిష్కారం కాని చిక్కుముడిని ఈ చిప్ విప్పిందని.. దీంతో కొత్త మెడిసిన్స్ ను కనిపెట్టటంతోపాటు ఫ్యూషన్ ఎనర్జీ.. బ్యాటరీ డిజైన్ వంటి ఎన్నో అంశాల్లో ఈ చిప్ సాయం చేస్తుందని చెబుతున్నారు.
ఇంతకూ ఈ చిప్ ఎలా పని చేస్తుందన్న సాంకేతిక అంశంలోకి వెళితే.. సమాచారాన్ని అర్థం చేసుకోవటానికి సాధారణ చిప్ లు బైనరీ భాష మీద ఆధారపడి పని చేస్తాయి. సున్నా లేదంటే ‘1’ సంఖ్యను ఉపయోగిస్తాయి. సున్నా అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం లేకపోవటం.. ఒకటి అంటే వాటిని ప్రసారం ఉండటం. సున్నా.. వన్ ను కలిపి బిట్ అంటారు.ఈ కోడ్ లో 1 అనే నెంబరును రాయటానికి 001 అని రాయాలి. అదే 2 సంఖ్యను రాయాలంటే 0011 అని రాయాలి.
కంప్యూటర్ లోని ట్రాన్సిస్టర్లు ఆగిపోతే 0 అని.. ఆన్ అయితే 1 అని కోడ్ వస్తుంది. ప్రస్తుతం కంప్యూటర్లు బైనరీ కోడ్ లోనే సమాచారాన్ని నిల్వ చేసి.. ప్రాసెస్ చేస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ ను వాడుతుంది. క్యూబిట్ ఒకే టైంలో 0గా.. 1గా ఉంటుంది. అంటే.. ఆన్.. ఆఫ్ స్థితిలో ఉంటుంది. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ సాయంతో సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఈ కొత్త చిప్ లో 105 క్యూబిట్స్ ను పొందుపర్చటంతో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది గూగుల్.