Begin typing your search above and press return to search.

"డేటా దొంగ గూగుల్".. యూజర్ల లొకేషన్ ట్రాక్.. రూ.7 వేల కోట్ల జరిమానా

ఇప్పుడంతా టెక్ ప్రపంచం.. ఏ పని కావాలన్నా ముందుగా ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నాం.. ఇన్ఫర్మేషన్.. లొకేషన్.. ఎంటర్టైన్ మెంట్.. ఇలా దేనికైనా ముందుగా ఎంచుకునే ఆప్షన్ ‘‘గూగుల్’’.

By:  Tupaki Desk   |   17 Sep 2023 1:30 AM GMT
డేటా దొంగ గూగుల్.. యూజర్ల లొకేషన్ ట్రాక్.. రూ.7 వేల కోట్ల జరిమానా
X

ఇప్పుడంతా టెక్ ప్రపంచం.. ఏ పని కావాలన్నా ముందుగా ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నాం.. ఇన్ఫర్మేషన్.. లొకేషన్.. ఎంటర్టైన్ మెంట్.. ఇలా దేనికైనా ముందుగా ఎంచుకునే ఆప్షన్ ‘‘గూగుల్’’. ఇంకా చాలా సెర్చ్ ఇంజన్లు.. బింగ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, మొజిల్లా తదితరాలు అందుబాటులో ఉన్నప్పటికీ నెటిజన్లు గూగుల్ నే నమ్ముకుంటున్నారు. ఎందుకంటే యూజర్ ఫ్లెండ్లీ కాబట్టి. అయితే, ఈ క్రమంలో వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పౌరుల డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే వాదన వస్తోంది. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తోందో తెలుసా?

గుత్తాధిపత్యంపై కేసు..

ఇంటర్ నెట్ లో గూగుల్ గుత్తాధిపత్యంపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. వాటిని పక్కనపెడితే యూజర్లకు బాగా పనికొస్తోంది కాబట్టి ఎవరూ ఏమీ పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. కాగా, గూగుల్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంగా ఎదగడానికి ఇది కూడా దోహదం చేసింది. ఇక గూగుల్ నిత్యం లొకేషన్ యాక్సెస్ ద్వారా యూజర్లను ట్రాక్ చేస్తుంది. అందులో ప్రధానంగా గూగుల్ మ్యాప్‌ లు, లోకేషన్-ఆధారిత సర్వీసుల కచ్చితత్వాన్ని మెరుగుపర్చడం, కొత్త ఉత్పత్తుల ఫీచర్లను అభివృద్ధి చేయడం లేదా సంబంధిత యాడ్స్ చూపించడం ఉంటాయి. మీరు కొనాలనుకునే ఉత్పత్తి గురించి నిమిషాల్లో అనేక యాడ్స్ చూపుతుంది. అయితే, ఇటీవల గూగుల్ పై అమెరికాలోని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దాఖలు చేసిన దావా విచారణకు వచ్చింది. ఆ దావా ప్రకారం.. గూగుల్ యూజర్ల ‘లొకేషన్ హిస్టరీ’ సెట్టింగ్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా వారి లొకేషన్ ను ట్రాక్ చేస్తోందనేది అభియోగం. ఇది నిరూపణ కావడంతో గూగుల్ కు రూ.వేల కోట్ల జరిమానా విధించారు.

సొంత లాభం కోసం పెడదారి..

గూగుల్ పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా వేశారు. యూజర్ల లొకేషన్ డేటాపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉన్నారని తప్పుడు అభిప్రాయాన్ని అందించడం ద్వారా కంపెనీ యూజర్లను మోసం చేసిందని ఆరోపించారు. గూగుల్ యూజర్లకు.. యూజర్ యాక్టివిటీ ఆప్షన్ స్టాప్ చేస్తే.. ఇకపై వారి లొకేషన్ ట్రాక్ చేయదని తెలిపింది. కానీ, దీనికి విరుద్ధంగా సొంత వాణిజ్య లాభం కోసం యూజర్ల కదలికలను ట్రాక్ చేస్తున్నదని బొంటా తెలిపారు.

తప్పు ఒప్పుకొన్న గూగుల్

రాబ్ బొంటా ఆరోపణలను గూగుల్ అంగీకరించింది. రూ.7 వేల కోట్లు (93 మిలియన్ డాలర్లు) చెల్లించడంతో పాటు అనేక అదనపు బాధ్యతలను ఒప్పుకొంది. ఇందులో లొకేషన్ ట్రాకింగ్ ప్రాక్టీసులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, టార్గెట్ చేసిన యాడ్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి లొకేషన్ డేటాను ఉపయోగించే ముందు యూజర్లకు ముందస్తు నోటిఫికేషన్‌లు పంపడం, ఏదైనా ప్రైవసీకి సంబంధిత మార్పులను అమలు చేయడానికి ముందు గూగుల్ ఇంటర్నల్ ప్రైవసీ వర్కింగ్ గ్రూప్ నుంచి ఆమోదం పొందడం వంటివి ఉన్నాయి. కాగా, ఇంటర్నెట్ అంతటా వివిధ కారణాల వల్ల గూగుల్ యూజర్లను ట్రాక్ చేస్తుంది. యూజర్లు ట్రాకింగ్‌ను నిలిపివేస్తే లొకేషన్‌ను ట్రాక్ చేయదని గూగుల్ గట్టిగా చెప్పేది. అయితే, ఇది అబద్ధం అని స్పష్టమైంది.

మెటా కూడా దొంగే..

అనుమతి లేకుండా వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఈ ఏడాది ప్రారంభంలో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటాపైనా వచ్చాయి. దీనికిగాను 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని, యూరప్‌లోని ఫేస్‌బుక్ యూజర్ల నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు సేకరించిన డేటా ట్రాన్స్‌ఫర్ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించింది.