Begin typing your search above and press return to search.

శృంగారంపై ఎక్కువ మందికి వచ్చే అనుమానాలేంటో?

ఈ రోజుల్లో చాలా మంది సె*క్స్ కు సంబందించిన చాలా అనుమానాలు గూగుల్ లో పంచుకుంటున్నారు

By:  Tupaki Desk   |   22 Dec 2023 12:30 AM GMT
శృంగారంపై ఎక్కువ మందికి వచ్చే అనుమానాలేంటో?
X

ఈ రోజుల్లో చాలా మంది సె*క్స్ కు సంబందించిన చాలా అనుమానాలు గూగుల్ లో పంచుకుంటున్నారు. ప్రతి వారిలో వీటిపై అనేక సంశయాలు ఉండటం కామనే. ఈనేపథ్యంలో సె*క్స్ విషయంలో మదిలో తలెత్తే ప్రశ్నలు గూగుల్ లో తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం సహజమే. అందుకే మనకు వచ్చిన డౌట్లు క్లియర్ చేసుకోవాలని గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. సె*క్స్ గురించి పలు పర్యాయాలు సెర్చ్ చేస్తున్నారు.

సె*క్స్ లో భావప్రాప్తి ముఖ్యమైనది. సె*క్స్ చేసే సమయంలో డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల ప్రభావం వల్ల అనుభూతి కలగడం సహజం. భావప్రాప్తికి ఇంకా పలు మార్గాలు కూడా ఉన్నాయి. వీటి విషయంలో చాలా మంది గూగుల్ లో ఎలా భావప్రాప్తి పొందాలని అడుగుతున్నారు. భావప్రాప్తి పొందేందుకు హస్తప్రయోగం, ఓరల్ సె*క్స్ వంటివి కూడా ఉంటాయి.

చాలా మందికి శీఘ్ర స్కలనం సమస్య ఉంటుంది. దీన్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలనే విషయంలో చాలా మంది పలు ప్రశ్నలు సంధిస్తుంటారు. స్కలనానికి ఇరవై ముప్పై సెకన్ల ముందు సె*క్స్ ను ఆపి తరువాత మొదలు పెడితే ఫలితం ఉంటుంది. ఈ టెక్నిక్ ద్వారా భాగస్వాములిద్దరు శీఘ్ర స్కలన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని తెలుసుకోవాలి.

రోజుకు ఎన్నిసార్లు సె*క్స్ లో పాల్గొనాలనే విషయంలో కూడా పలు ప్రశ్నలు వేస్తుంటారు. కొందరు రోజుకు రెండుమూడు సార్లు సె*క్స్ లో పాల్గొంటారు. మరికొందరు నెలకో సారి చేస్తుంటారు. అవగాహన, సౌలభ్యం, ప్రేమ విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొందరైతే నెలలో రెండు సార్లు మాత్రంలో పాల్గొంటుంటారు. ఇలా సె*క్స్ చేసే క్రమంలో గూగుల్ లో చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు.

సె*క్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందనే భయం కూడా ఉంటుంది. అందుకే సె*క్స్ చేసేటప్పుడు గర్భనిరోధక మాత్రలు ఏం వాడాలనే విషయంపై ప్రశ్నిస్తుంటారు. గర్భనిరోధక మాత్రలు గర్భం రాకుండా నిరోధిస్తాయి. కానీ వాటి వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే సుఖవ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కూడా పలు ప్రశ్నలు అడుగుతుంటారు.