Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ స్మాల్ గ్యాప్, అదానీ ఈజ్ బ్యాక్... వివరాలివే!

గతఏడాది అమెరికా ఆధారిత షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల సమయంలో అదానీ గ్రూప్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:09 AM GMT
ఆఫ్టర్  స్మాల్  గ్యాప్, అదానీ ఈజ్  బ్యాక్... వివరాలివే!
X

గతఏడాది అమెరికా ఆధారిత షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల సమయంలో అదానీ గ్రూప్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఉన్నపలంగా షేర్ లు పడిపోవడంతో... ధనవంతుల జాబితాలో కూడా అదానీ పేరు కిందకిపడిపోవడం మొదలైంది. అయితే... తాజాగా ఆదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం ఆదానీ తన సంపదను పెంచుకున్నారు. ఇందులో భాగంగా ఆయన 100 బిలియన్ డాలర్ల క్లబ్‌ లో చేరారు.

అవును... 2023 హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల తర్వాత ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం ఆదానీ ఆస్తి పెరిగింది. ఫలితంగా ఆయన తాజాగా ఇప్పుడు రూ.100 బిలియన్ డాలర్ల క్లబ్‌ లో చేరిపోయారు. బ్లూం బెర్గ్‌ నివేధిక ప్రకారం.. ప్రస్తుతం గౌతం ఆదానీ నికర విలువ 101 బిలయన్ల డాలర్లకు పెరిగింది. దీంతో అతను ప్రపంచంలోని 12వ ధనవంతుడిగా మారారని తెలుస్తుంది.

వాస్తవానికి అయితే గత ఏడాది జనవరి నాటికి అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ... సరిగ్గా అదే సమయంలో హిండెన్‌ బర్గ్ నివేదిక తెరపైకి రావడంతో ఆయన గ్రూప్ తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం గౌతం అదానీ ఆస్తుల విలువ పెరగడంతో టాప్ 12 లిస్ట్ లో ఆయనకు స్థానం దక్కింది. మరోపక్క ముకేష్ అంబానీ 108 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.

బ్లూం బెర్గ్‌ రిపోర్ట్స్ ప్రకారం టాప్ 12 రిచ్చెస్ట్ పీపుల్ జాబితా!:

ఎలాన్ మస్క్ - $ 205 బిలియన్లు

జెఫ్ బిజోస్ - $ 196 బిలియన్లు

బెర్నార్డ్ ఆర్నల్ట్ - $ 186 బిలియన్లు

మార్క్ జుకెర్ బర్గ్ - $ 169 బిలియన్లు

బిల్ గేట్స్ - $ 146 బిలియన్లు

స్టీవ్ బాల్ మెర్ - $ 143 బిలియన్లు

వారెన్ బఫెట్ - $ 132 బిలియన్లు

లార్రీ పేజ్ - $ 131 బిలియన్లు

లార్రీ ఎర్రిసార్ - $ 131 బిలియన్లు

సెర్గెయ్ బ్రిన్ - $ 125 బిలియన్లు

ముకేష్ అంబానీ - $ 108 బిలియన్లు

గౌతం అదానీ - $ 101 బిలియన్లు