రాజ్‌భవన్ తో రగడ మంచిది కాదు: కేసీఆర్‌కే తమిళసై.. వార్నింగా? సూచనా?!
కానీ, ప్రభుత్వం నన్ను అనేక రూపాల్లో అవమానాలకు గురి చేస్తోంది. ఇది మంచిది కాదు'' - అని తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 16 Aug 2023 12:30 AM GMT''రాజ్‌భవన్‌తో రగడ(క్వారల్) మంచిది కాదు. రాష్ట్రం బాగుండాలనే నేను కూడా కోరుకుంటున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేను కూడా తెలంగాణ బిడ్డగానే మసులు కుంటున్నాను.
కానీ, ప్రభుత్వం నన్ను అనేక రూపాల్లో అవమానాలకు గురి చేస్తోంది. ఇది మంచిది కాదు'' - అని తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్స వేడుకలను పురస్కరించుకుని.. రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రుల వరకు.. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ ఎట్ హోమ్‌కు హాజరు కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే బహిష్కరించాలనే అనాలి.
ఇక, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, వివిధ రంగాల ప్రముఖులు, సాహితీ వేత్తలు, పద్మశ్రీ అవర్డు గ్రహీతలు, పలువురు సైనిక కుంటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
''ముఖ్యమంత్రి కార్యాలయానికి మేం ఆహ్వానం పంపించాం. అందిందని ప్రత్యుత్తరం(ఆన్సర్) కూడా ఇచ్చారు. కానీ, ముఖ్యమంత్రి రాలేదు. ఇది సుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేయడమే. నేను కలిసి మెలిసిఉండాలనే కోరుకుంటున్నారు. కానీ, ముఖ్యమంత్రే ఇలా రాకపోతే ఎలా'' అని తమిళిసై.. మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, సీఎం కేసీఆర్ ఎట్ హోంకు హాజరు కాకపోవడం ఇది వరుసగా మూడో సారి. మరి గవర్నర్ వ్యాఖ్యలపై కేసీఆర్ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.