Begin typing your search above and press return to search.

రైలు ప్రయాణం చేస్తున్నారా ? అయితే ఇది మరిచిపోకండి !

తాజాగా నిన్న ఉదయం కాంచనగంగ రైలు ప్రమాదంలో 15 మంది చనిపోగా, 60 మంది గాయపడ్డారు. 2018 అక్టోబర్ 19న అమృత్‌సర్ రైలు ప్రమాదంలో 60 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 7:30 AM GMT
రైలు ప్రయాణం చేస్తున్నారా ? అయితే ఇది మరిచిపోకండి !
X

మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా ? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. కేవలం 45 పైసలు చెల్లించడం ద్వారా రూ. 7 నుండి 10 లక్షల వరకు భీమా పొందవచ్చు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అనే ఆప్షన్ ఉంటుంది. దీని కోసం నామమాత్రంగా 45 పైసలు తీసుకుంటారు. ఆ ప్రయాణంలో గాయపడ్డా, మరణించినా రూ.7.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది.

2023 జూన్ 2న జరిగిన ఒడిశాలోని బాలాసోర్ వద్ద రైలు ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్సు రైలు, హౌరా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 290 మంది మరణించగా, 1200 మంది గాయపడ్డారు. తాజాగా నిన్న ఉదయం కాంచనగంగ రైలు ప్రమాదంలో 15 మంది చనిపోగా, 60 మంది గాయపడ్డారు. 2018 అక్టోబర్ 19న అమృత్‌సర్ రైలు ప్రమాదంలో 60 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముందుచూపుతో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మూలంగా ప్రభుత్వాలు ఇచ్చే దాని కోసం ఎదురు చూడకుండా పరిహారం అందుకునే అవకాశం ఉంది.

దీని మూలంగా రైలు ప్రమాదంలో ప్రయాణికుడు గాయపడితే ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.2 లక్షల వైద్యం ఉచితంగా లభిస్తుంది. అదే సమయంలో ప్రయాణికుడు మరణిస్తే లేదా వికలాంగుడైతే అతని కుటుంబానికి రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. 45 పైసల విలువైన బీమా తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ బీమాను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు నామినీ వివరాలను సరిగ్గా పూరించాలి. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మెయిల్‌కు పంపిన లింక్‌లో ఈ వివరాలను పూరించే ఎంపిక అందుబాటులో ఉంది. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఏజెంట్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే, అతని స్వంత ఇమెయిల్ ఐడీని ఉపయోగించాలి. తద్వారా నామినీ పేరును పూరించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ చేయడంలో ఎలాంటి సమస్య కూడా ఉండదు.