గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్... సుప్రీంకోర్టుకెళ్లిన పంచాయతీ!
ఇందులో భాగంగా... క్లియరెన్స్ కోసం పంపిన బిల్లుల ఆమోదాన్ని ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తుంది.
By: Tupaki Desk | 31 Oct 2023 3:17 PM GMTఈ మధ్యకాలంలో గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ విషయాలు ఎక్కువగా తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా బీజేపీయేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకూ, ఆ రాష్ట్ర గవర్నర్ లకూ మధ్య సఖ్యత కొరవడుతుందనే కామెంట్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గతకొంతకాలంగా తెలంగాణలోనూ, అటు తమిళనాడులోనూ దీనికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది!
అవును... తాజాగా తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య కొనసాగుతున్నట్లు చెబుతున్న విభేదాలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా... క్లియరెన్స్ కోసం పంపిన బిల్లుల ఆమోదాన్ని ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీంతో... ఈ విషయంపై తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ సందర్భంగా... నిర్దిష్ట గడువులోగా బిల్లులను ఆమోదించేలా లేదా పరిష్కరించేలా గవర్నర్ ను ఆదేశించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నిన్న మొన్నటివరకూ మాటల యుద్ధంగా ఉన్న వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టడం గమనార్హం!
ఈ విషయాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఈ విషయాలను ప్రస్థావించింది. ఇందులో భాగంగా... రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ రవి కావాలనే అడ్డుకుంటున్నారని, సకాలంలో ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలో... 54 మంది ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన పన్నెండు బిల్లులు, పలు ఫైళ్లు ప్రస్తుతం గవర్నర్ ముందు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
కాగా... తమిళనాడు పేరును "తమిళగం" అని మార్చాలంటూ ఈ ఏడాది జనరిలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు తమిళనాట ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. దాదాపు అది అది మొదలు స్టాలిన్ ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య విభేదాలు రగులుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే... పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమేంటని ప్రభుత్వం గట్టిగా ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో... ప్రజల అభీష్టాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగ అధికారాన్ని గవర్నర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా... క్లియరెన్స్ కోసం పంపిన బిల్లుల ఆమోదాన్ని గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది!