Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రుల్లో పట్టభద్రులు ఎందరో తెలుసా ?

ఆరు మంది డాక్టర్లు. ఐదు మంది ఇంజనీర్లు. ముగ్గురు న్యాయవాదులు. ఏడుగురు పీహెచ్డీ, ముగ్గురు ఎంబీఎ

By:  Tupaki Desk   |   12 Jun 2024 3:53 AM GMT
కేంద్రమంత్రుల్లో పట్టభద్రులు ఎందరో తెలుసా ?
X

ఆరు మంది డాక్టర్లు. ఐదు మంది ఇంజనీర్లు. ముగ్గురు న్యాయవాదులు. ఏడుగురు పీహెచ్డీ, ముగ్గురు ఎంబీఎ. ఈ కళాశాల ర్యాంకులో కాదు. భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనతో కలిసి ఉన్న 72 మంది మంత్రులలో ఉన్న వారి అర్హతలు. మొత్తం 72 మందిలో 68 మంది పట్టభద్రులు ఉండడం విశేషం. ఇప్పటికే పరిపాలనలో సుధీర్ఘ అనుభవం ఉన్న ఏడుగురు బ్యూరోక్రాట్లు ఈ మంత్రివర్గంలో ఉండడం విశేషం.

రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, అశ్వినీ వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి, భూపేంద్ర యాదవ్, వీరేంద్ర కుమార్‌లకు పాత శాఖలే అప్పగించారు. అత్యంత కీలకంగా భావించే హోం, ఆర్థిక, రక్షణ, రైల్వే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

కొత్తగా వచ్చిన మిత్రపక్షాల సభ్యులలో కూడా విద్యాధికులకు అవకాశం కల్పించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి, రాందాస్ అథవాలే, అనుప్రియా పటేల్ తదితరులకు అవకాశం కల్పించడం విశేషం. వీరి ఎంపిక దేశానికి మరింత మేలు చేస్తుందని ఆశిద్దాం.