Begin typing your search above and press return to search.

ఆ కార్లపై భారతీయుల ఇంట్రస్ట్ మామూలుగా లేదు!

అవును... భారతీయ ఆటోమోటివ్ రంగంలో నవ శకానికి వేదికగా వినియోగదారులు లగ్జరీ కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారని గ్రాంట్ థార్న్ టన్ భారత్ సర్వే వెల్లడించింది.

By:  Tupaki Desk   |   29 Oct 2024 4:10 AM GMT
ఆ కార్లపై  భారతీయుల ఇంట్రస్ట్  మామూలుగా లేదు!
X

పండగల సీజన్ వచ్చిందంటే భారత్ లో వాహనాల అమ్మకాలు జోరందుకుంటాయని.. వార్షిక అమ్మకాల్లో 30 నుంచి 40 శాతం పండగల సీజన్ లోనే ఉంటాయని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... భారతీయులు ఎక్కువగా ఏ కార్లను ఇష్టపడుతున్నారో గ్రాంట్ థార్న్ టన్ భారత్ సర్వే వెల్లడించింది.

అవును... భారతీయ ఆటోమోటివ్ రంగంలో నవ శకానికి వేదికగా వినియోగదారులు లగ్జరీ కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారని గ్రాంట్ థార్న్ టన్ భారత్ సర్వే వెల్లడించింది. భారత్ లో నూటికి 85 మంది ప్రీమియం మోడళ్లను పరిశీలిస్తున్నారని.. ఈవీ కంటే హైబ్రిడ్ వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది.

సుమారు 3,500 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో 40 శతం మంది హైబ్రిడ్ వాహనాలను ఇష్టపడతారని 17 శతం మంది మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) లపై ఆసక్తి చూపిస్తున్నరని చెబుతున్నారు. ఇదే సమయంలో... 34 శతం మంది ఇప్పటికీ పెట్రోల్ వాహనాల వైపే మొగ్గు చూపుతుండటం గమనార్హం.

దీంతో... అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అంచనాలను అంద్కోవడానికి.. స్థిరమైన ఆటోమోటివ్ భవిష్యత్తు కోసం సిద్ధం కావడానికి వాహన తయారీదారులు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు.. రెండింటిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ధోర్ణి నొక్కి చెబుతుందని అంటున్నారు పరిశీలకులు.

ఈ విషయాలపై స్పందించిన గ్రాంట్ థార్న్ టన్ భారత్ పార్టనర్, ఆటో & ఏవీ ఇండస్ట్రీ లీడర్ సాకేత్ మొహ్రా... మార్కెట్ డైనమిక్స్ అభివృద్ధి చెందుతున్నందున, వాహన తయారీదారులు వినియోగదారుల ప్రాధాన్యతలను మార్చడాన్నికి అనుగుణంగా ఉండాలని తెలిపారు. వాతావరణ అంతరాయాలు, ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో ఈసారి పండగ సీజన్ లో ఆశించిన ఫల్లితాలు రాలేదని అన్నారు.

ఇక.. యుటిలిటీ వెహికల్ (యూవీ), స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్.యూ.వి) విభాగాలు మార్కెట్ ను నడిపిస్తూనే ఉన్నాయని, ఏడాది ప్రాతిప్దికన 13 శాతం వృద్ధిని సాధించిందని తెలిపరు. ఇదే సమయంలో... ప్యాసింజర్ వెహికల్ (పీవీ) అమ్మకాల్లో ఇది 65% గాఉందని ఆయన తెలిపారు.