వల్లభనేని వంశీకి వరుస షాక్ లు!
తాజాగా వంశీకి వరుస షాక్ లు అనే చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 19 Nov 2024 8:15 AM GMTటీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అనంతరం 2019-24 మధ్యకాలంలో వైసీపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా వంశీకి వరుస షాక్ లు అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుస షాకులు తగులుతున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై విజిలెన్సు విచారణ జరుగుతుందని అన్నారు.
ఇదే సమయంలో... త్వరలోనే చర్యలు తీసుకుంటామని.. అవసరమైన ప్రాంతాల్లో సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి మాత్రం విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. అది పూర్తవ్వగానే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదే సమయంలో... ఇప్పటికే ఈ వ్యవహారంపై సుమారు 179 మందిపై కేసులు నమోదు చేశారని అన్నారు.
దీంతో... గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ప్రభుత్వ విజిలెన్స్ విచారణ ఒకపక్క అయితే... మరోపక్క వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు! తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు పలువురిని ఆరెస్ట్ చేశారు!
ఇక.. ఈ కేసు వివరాళ్లోకి వెళ్తే... గతంలో వైసీపీలో ఉన్న కాసనేని రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయితే.. దీన్ని వంశీ అనుచరులు జీర్ణించుకోలేకపోయారంట. దీనో.. పొలం విషయంలో మాట్లాడుకోవడానికి అని పిలిచి గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆనపై దాడికి పాల్పడ్డారట. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే... గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు ముందుకు కదలలేదని అంటున్నారు. దీంతో.. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టిసారించారని.. ఇందులో భాగంగానే వంశీ ప్రధాన అనుచరుడిగా చెబుతున్న ఓలుపల్లి మోహనరంగాను అరెస్ట్ చేశారు!