Begin typing your search above and press return to search.

గ్రీన్ లాండ్ పై ట్రంప్ పట్టుకు ఇదా అసలు కారణం?

అమెరికా స్టేట్స్ లో గ్రీన్ లాండ్ విలీనం కావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jan 2025 4:02 AM GMT
గ్రీన్ లాండ్  పై ట్రంప్ పట్టుకు ఇదా అసలు కారణం?
X

అమెరికా స్టేట్స్ లో గ్రీన్ లాండ్ విలీనం కావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఆయన చెబుతున్న కారణం.. అక్కడున్న 55,000 మంది ప్రజలు అమెరికాతో విలీనం కోరుకుంటున్నారని! ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ స్థాయిలో పట్టుబట్టడానికి అసలూ కారణం వేరే ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన గ్రీన్ లాండ్ ప్రస్తుతం డెన్మార్ దేశ నియంత్రణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రీన్ లాండ్ ను హస్తగతం చేసుకోవాలని ట్రంప్ భావిస్తుండగా.. ఆ దేశం అందుకు విభేదిస్తుంది. అయితే.. ట్రంప్ ఈ స్థాయిలో పట్టుబట్టడానికి కారణం “గోల్డెన్ బెల్ట్' అని పిలిచే ఖనిజ వనరులు భారీగా ఉండటమే అని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మైనింగ్ కంపెనీ అమరోక్ మినరల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎల్దుర్ ఒలాఫ్సన్... ఇక్కడ చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయని, అమితమైన ఖనిజ సంపద ఉందని, ఇది ప్రాథమికంగా ఒక గోల్డెన్ బెల్ట్ అని అన్నారు. నలునాక్ పర్వతం కింద ఉన్న ఒక మారుమూల లోయ వద్ద సంస్థ బంగారం కోసం డ్రిల్లింగ్ చేస్తోందని చెప్పారు!

ఇక్కడున్న బేస్ క్యాంప్ లో మొబైల్ నివాసాలు ఏర్పరచుకుని, అందులో గ్రీన్ ల్యాండర్లతోపాటు ఆస్ట్రేలియన్లు, బ్రిటిష్ మాజీ బొగ్గు గని కార్మికులు 100 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని.. అక్కడ నుంచి ఒక రహదారి గుండా లోయ పైకి వెళ్తే.. అక్కడ పర్వతంలోపల ఉన్న చీకటి సొరంగ బంగారు గనికి కారులో తీసుకెళ్లగలుగుతుందని వెళ్లడించారు!

వాస్తవానికి ఇక్కడ 2015లో అమరోక్ కొనుగోలు చేసిన గని చాలా కాలం పని చేశారు కానీ.. ధరలు తగ్గడం, అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా మూసివేయబడిందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు ధరలు పెరగడంతో ఇది ఇకపై పూర్తి లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ నుంచి ప్రతినెలా 30,000 టన్నుల గోల్డ్ ను తరలించొచ్చని అంటున్నారు!

ఇదే సమయంలో... మొత్తం ద్వీపంలో రెండు క్రియాశీల గనులు ఉన్నాయని.. ఇది అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలవబడే ఎనిమిదో అతిపెద్ద నిల్వలను కలిగి ఉందని.. ఇవి మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేయడంలో ముఖ్యమైనదని.. లిథియం, కోబాల్ట్ వంటి ఇతర లోహాలు ఇక్కడ పెద్దమొత్తంలో ఉన్నాయని అంటున్నారు.

ఈ గ్రీన్ లాండ్ పై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో పట్టు పడుతుండటానికి కారణం ఇవి కూడా కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం... అమెరికాలో గ్రీన్ ల్యాండ్ విలీనం తమ కోసం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత ప్రపంచం కోసమని చెప్పుకొస్తున్నారు.