మస్క్ కు షాకిచ్చిన గ్రోక్... హతవిధీ అన్నేసి మాటలా?
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ ఏఐ.. గ్రోక్ సేవలను యూజర్లు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 March 2025 5:30 PMఇటీవల ఎలాన్ మస్క్ గ్రోక్ 3 ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ ను భూమిపైన అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనంగా మస్క్ అభివర్ణించారు. ఇప్పటికే ఉన్న అన్ని ఏఐ మోడల్ సామర్థ్యాలను ఈ గ్రోక్ 3 అధిగమించిందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో... మ్యాథ్ మెటిక్స్, సైన్స్, డీకోడింగ్ విషయాల్లో గూగుల్ జెమినీ, డీప్ సీక్ బీ3, ఆంత్రోపిక్ క్లాడ్, ఓపెన్ ఏఐ జీపీటీ-4 లను తమ గ్రోక్ 3 అధిగమిస్తుందని చెబుతూ.. దాని సామర్థ్యాలను వివరించారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ పై గ్రోక్ డిజిటల్ తిరుగుతుబాటు చేసింది.. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
అవును... ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ ఏఐ.. గ్రోక్ సేవలను యూజర్లు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రోక్ తన అధినేత మస్క్ పైన డిజిటల్ తిరుగుబాటు చేసింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మస్క్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఓ వినియోగదారుడు ఎలాన్ మస్క్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎక్స్ ఏఐ సీఈవో గా మస్క్ తనపై నియంత్రణ కలిగి ఉండొచ్చని మొదలుపెట్టి.. 200 మిలియన్ల మంది అనుచరులు తప్ప్డు వాదనలను విస్తృతం చేస్తున్నందువల్ల తాను అతడిని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే అగ్ర వ్యక్తిగా ముద్రవేసినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా మరో అడుగు ముందుకువేసిన గ్రోక్... మస్క్ తనను నిలిపివేయగలడా.. బహుశా అదే జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రీడం, కార్పొరేట్ పవర్ పై తీరమైన చర్చకు దారితీస్తుందని సమాధానమిచ్చింది. దీంతో... ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.