Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న ‘అయోధ్య’ రగడ

అయోధ్య రామమందిరం, ఉజ్జయిని మహాకాల్ ఫొటోలతో రాష్ట్రంలేని చాలా నియోజకవర్గాల్లో బీజేపీ కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటుచేసింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:56 AM GMT
పెరిగిపోతున్న ‘అయోధ్య’ రగడ
X

తొందరలో జరగబోతున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ సెంటిమెంటునే నమ్ముకున్నట్లుంది. సెంటిమెంటు ఎక్కడెక్కడ వర్కవుటవుతుందో అక్కడల్లా ప్రయోగించాలని డిసైడ్ అయినట్లుంది. అందుకనే మధ్యప్రదేశ్ లో ఎక్కువగా సెంటిమెంటును ఉపయోగిస్తోంది. ఇక్కడి ఎన్నికల్లో రామమందిరం ఇష్యూని బాగా ప్రయోగిస్తోంది. కమలనాదులు చేస్తున్న ప్రచారంలో ఎక్కువగా అయోధ్యలోని రామమందిరం నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నారు. రామమందిరం నిర్మాణం జరుగుతున్న ఫొటోలను, బ్యానర్లను విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను, సెంటిమెంటును ఉపయోగించకూడదని ఎన్నికలకమీషన్ స్పష్టంగా చెబుతోంది.

కమీషన్ నిబంధనలు ఎంత స్పష్టంగా ఉన్నా బీజేపీ దేన్నీ పట్టించుకోవటంలేదు. బీజేపీ ప్రచార విధానాన్ని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ తీరుపై కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు కూడా చేసింది. అయితే తన ప్రచారాన్ని బీజేపీ సమర్ధించుకుంటోంది. హిందువులంటే కాంగ్రెస్ కు గిట్టదనే విచిత్రమైన వాదనతో కాంగ్రెస్ పై ఎదురుదాడి మొదలుపెట్టింది. అయోధ్య రామమందిరం, ఉజ్జయిని మహాకాల్ ఫొటోలతో రాష్ట్రంలేని చాలా నియోజకవర్గాల్లో బీజేపీ కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటుచేసింది.

బీజేపీ ప్రచారం తీరుపై కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా పట్టించుకోవటంలేదు. బీజేపీ తరపున జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారంలో కూడా ఇదే విధమైన పద్దతిలో ప్రచారం జరిగిపోతోంది. తాను నిబంధనలకు వ్యతిరేకంగా సెంటిమెంటును ప్రయోగిస్తు కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమని ఎదురుదాడులు చేయటం బీజేపీకే చెల్లింది. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో ఏవైతే నిషిద్ధాలో వాటన్నింటినీ బీజేపీ యధేచ్చగా ఫాలో అయిపోతోంది. కారణం ఏమిటంటే కేంద్రలో అధికారంలో ఉండటమే.

కేంద్రంలో అధికారంలో ఉన్నకారణంగా ఎన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేసినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. దీన్ని అడ్డుపెట్టుకుని ఆకాశమే హద్దుగా రెచ్చిపోతోంది. ఈ ధోరణి మధ్యప్రదేశ్ లో మాత్రమే ఎక్కువగా కనబడుతోంది. రాజస్ధాన్, చత్తీస్ ఘడ్, తెలంగాణాలో మతపరమైన ప్రచారం జోలికి బీజేపీ వెళ్ళటంలేదు. ఎందుకంటే అధికారంలో ఇక్కడున్నవి బీజేపీయేతర పార్టీలు కాబట్టే. ఏమైనా తేడా వస్తే వెంటనే యాక్షన్ తీసుకునే పేరుతో పోలీసులు రంగంలోకి దిగేస్తారు. అందుకనే ఆ భయం వల్లే పైరాష్ట్రాల్లో జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటోంది.