రుషి కొండ ప్యాలెస్.. జగన్ కోసం కాదు: గుడివాడ
ఈ ప్యాలెస్‌కు సంబంధించి వీడియోలు, ఫొటోలను కూడా.. మీడియాకు విడుదల చేసి న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 Jun 2024 9:18 AM GMTవిశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండపై వైసీపీ హయాంలో రూ.500 కోట్లకు పైగానే ఖర్చుచేసి నిర్మించిన విలాసవంతపై ప్యాలెస్ రాజకీయంగా వివాదానికి కారణమైంది. ఈ ప్యాలెస్‌ను జగన్ తన కుటుంబం కోసం నిర్మించుకున్నారని.. తన సతీమణి కోసం ప్రత్యేకంగాగదులు నిర్మించారని.. విశాలవం తమైన బాత్రూంలు.. నిర్మించుకున్నారని, దీనికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని.. అధికార పార్టీ టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ ప్యాలెస్‌కు సంబంధించి వీడియోలు, ఫొటోలను కూడా.. మీడియాకు విడుదల చేసి న విషయం తెలిసిందే.
దీంతో రుషికొండ ప్యాలెస్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాద అమర్‌నాథ్ రియాక్ట్ అయ్యారు. రుషికొండ ప్యాలెస్‌ను జగన్‌కోసం నిర్మించుకోలేదన్నారు. దీనిని ప్రభుత్వం కోసమే నిర్మించారని తెలిపా రు. తమ ప్రభుత్వమే మరోసారి వస్తుందని ఆశించామని.. అయితే.. ప్రజా తీర్పు వేరే విధంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జగన్ ఒక్కసారికూడా ఇక్కడకు రాలేదన్నారు. జగన్‌కు ఆ ఆశ కూడా లేదన్నారు. ఈ ప్యాలెస్‌ను ప్రస్తుత ప్రభుత్వం తన అవసరాలకు ఎలాగైనా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
దీనిని ఆలోచించడం మానేసి వైసీపీ నేతలు, జగన్‌పై విమర్శలు చేస్తే.. ఏమీ రాదని గుడివాడ వ్యాఖ్యానిం చారు. ప్రతి విషయాన్ని వివాదం చేయడం మానుకోవాలని సూచించారు. విశాఖను జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నారని కానీ, అప్పట్లోనూ ప్రతిపక్షాలు అనేక ఇబ్బందులు పెట్టి అడ్డుకున్నాయని తెలిపారు. రుషి కొండ అనధికార కట్టడం కాదని మాజీ మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి పూర్తిప్లాన్ ప్రభుత్వం దగ్గరే ఉందని తెలిపారు.
గతంలోనే జగన్.. రుషి కొండ నిర్మాణానికి సంబంధించి.. ముగ్గురు ఐఏఎస్‌లతోకూడిన కమిటీని నియ మించారని గుడివాడవివరించారు. వారు చేసిన సూచనలు, ఇచ్చిన నివేదిక ఆధారంగానే నిర్మాణాలు చేపట్టారని వివరించారు. తాము కూడా విమర్శలు చేయగలమని.. గతచంద్రబాబు ప్రభుత్వంలో ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందో వారు ఆలోచించుకోవాలని అన్నారు. కానీ, తాము అలాంటి వివరాలు చెప్పదలుచుకోలేదని.. గౌరవంగా వ్యవహరిస్తున్నామని మాజీ మంత్రి చెప్పారు.