Begin typing your search above and press return to search.

మాజీ 'గుడ్డు' మంత్రి మళ్లీ దొరికేశాడుగా?

ఈ క్రమంలో తాజాగా మాజీమంత్రి అలియాస్ ‘గుడ్డు’ మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:53 AM GMT
మాజీ గుడ్డు మంత్రి మళ్లీ దొరికేశాడుగా?
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయానికి గల కారణాలను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా విశ్లేషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మాజీమంత్రులు ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రుల నోటి దూల వల్లే ఓటమి అని అంటే.. మార్చుకుంటాం అన్నట్లుగా మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ స్పందించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో... మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గు పడాల్సిన అవసరం లేదు అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా మాజీమంత్రి అలియాస్ 'గుడ్డు'మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తమ ఓటమికి గల కారణాలను ఆయన బాగానే విశ్లేషించుకున్నట్లున్నాడు.. అందుకే ఓపెన్ అయిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును.. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసినవారే నేడు ఆ పార్టీ ఘొర పరాజయానికి కీలక కారణం అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పరిపూర్ణమైన అపరిపక్వతతో స్పందించడం, నిర్ణయాలు తీసుకొవడం అందులో ఒకటని అంటున్నారు. ఇక ఆ పార్టీలో మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినవారిలో బాగా ట్రోల్ అయినవారిలో అమర్నాథ్ ముందు వరుసలో ఉంటారనే చెప్పొచ్చు. ప్రధానంగా పవన్ కల్యాణ్ తనతో ఫోటో తీయించుకున్నారని చెప్పిన విషయంపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇక ఏపీలో పరిశ్రమల విషయంలో ఆయన చెప్పిన గుడ్డు పురాణం అప్పట్లో ట్రోలర్స్ కి దొరికిన ఓ వరం!

ఇక ప్రస్తుతం వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించడం, రుషికోండపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించడంపై ప్రస్తుతం బలంగా మాట్లాడుతున్న నేతల్లో అమర్నాథ్ ఒకరు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలోని వైసీపీ కార్యలయానికి అధికారులు నోటీసులు అంటించడంపైనా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే ఈరోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లేదంటే.. ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేస్తూ ఉండేవాళ్లం" అని మాజీమంత్రి స్పందించారు. దీంతో... ఎప్పుడూ పార్టీని డిఫెండ్ చేస్తూ మాట్లాడే అమర్నాథ్.. ఇలా ఓపెన్ గా విమర్శనాత్మకంగా మాట్లాడటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంతో గుడ్డు మంత్రి మళ్లీ దొరికేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.