పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ మైనార్టీలకు దక్కిన పౌరసత్వం
అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి భారత పౌరసత్వం అందించేందుకు చర్యలు తీసుకుంది.
By: Tupaki Desk | 17 March 2024 10:29 AM GMTసీఏఏ చట్టం అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాక్ నుంచి వచ్చిన 18 మంది హిందూ శరణార్థులకు గుజరాత్ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. ఈమేరకు చర్యలు తీసుకుంటోంది. వారంతా కొన్నేళ్లుగా అహ్మదాబాద్ లో ఉంటున్నారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చే అధికారాన్ని సీఏఏ ద్వారా అమలు చేయాలని భావించింది.
అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి భారత పౌరసత్వం అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇంతవరకు అహ్మదాబాద్ లో 1167 మందికి భారత పౌరసత్వం లభించింది. దీంతో కేంద్రం అనుకున్న విధంగా చట్టం అమలు పరిచే బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్తోంది. ఈనేపథ్యంలోనే వారికి భారత పౌరసత్వం లభించడం పట్ల వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా సీఏఏ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. దీని కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఉపేక్షించేది లేదని భావిస్తోంది. దీని కోసమే అన్ని మార్గాలు తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు కావాల్సిన యంత్రాంగాన్ని ఇప్పటికే సిద్ధం చేసింది. బీజేపీ ప్రభుత్వం సీఏఏ చట్టం అమలు చేయడానికే మొగ్గు చూపుతోంది.
కొన్ని రాష్ట్రాలు సీఏఏ చట్టాన్ని అమలు చేయమని చెబుతున్నా వారి మాటలను లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎవరు అడ్డు వచ్చినా ఉపేక్షించేది లేదని తేల్చింది. సీఏఏ అమలు చేసేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చి వారి బతుకులకు భరోసా కల్పించేందుకు నిర్ణయించుకుంది.
సీఏఏ అమలు వెనకడుగు వేసేది లేదని చెబుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా సందర్భాల్లో సీఏఏ గురించి మాట్లాడారు. ఎవరు కాదన్నా ఆపేది లేదు. చట్టసభల్లో ఆమోదం పొందిన చట్టం కావడంతో దీని అమలులో అవాంతరాలు రాకుండా చూసుకుంటామని చెబుతున్నారు. దీంతో సీఏఏ అమలు చేసి అక్కడ నుంచి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పిస్తామని భరోసా కల్పించారు.