గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో జగన్ సరికొత్త ఆలోచన ఇదే!?
అవును... ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకుంటున్న గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు
By: Tupaki Desk | 14 March 2024 2:01 PM GMTగడిచిన 2014, 2019 ఎన్నికల్లోనూ దక్కని గుంటూరు లోక్ సభ స్థానాన్ని ఈసారి ఎలాగైనా కైవశం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు. పైగా వైనాట్ 175, వైనాట్ 25 అంటున్న నేపథ్యంలో... ఏ చిన్న విషయాన్ని లైట్ తీసుకునే ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది. ఈ సమయంలో గుంటూరు లోక్ సభ అభ్యర్థి విషయంలో జగన్ పునరాలోచన, సరికొత్త ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో అనూహ్యంగా కొత్తపేరు తెరపైకి వచ్చింది.
అవును... ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకుంటున్న గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ గత రెండు దఫాలుగా గల్లా జయదేవ్ గెలుస్తూ వస్తున్నాయి. అయితే.. ఆయన ఈసారి పోటీ చేయడంలేదు! దీంతో మరో అభ్యర్థికోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించింది. ఈ సమయంలో ఈ దఫా ఈ సీటు ఎట్టిపరిస్థితిల్లో గెలవాలనే ప్రయత్నంలో ఇప్పటికే ఇక్కడ ఇద్దరు ఇన్ ఛార్జ్ లను మార్చారు జగన్.
వాస్తవానికి ముందుగా ఇక్కడ నుంచి పోటీచేయాలని నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులను కోరారు జగన్. అయితే అందుకు అంగీకరించని ఆయన... టీడీపీలో చేరి అదే టిక్కెట్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో... వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణను గుంటూరు లోక్ సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు జగన్. అనంతరం అతి స్వల్ప వ్యవధిలోనే వెంకటరమణ స్థానంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను సమన్వయకర్తగా నియమించారు.
దీంతో గుంటూరు లోక్ సభ స్థానం సమస్య తీరిందని భావిస్తున్న సమయంలో... రోశయ్య యాక్టివ్ గా లేకపోవడం.. పోటీ చేసే విషయంలో అనాశక్తి చూపిస్తున్నారని తెలియడంతో.. జగన్ మరో ఆలోచనకు వెళ్లారని తెలుస్తుంది. ఇందులో భాగంగా రోశయ్య స్థానంలో ముస్లిం మహిళ, విద్యావంతురాలైన జహారాబేగంను రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తుంది. ఈమె అభ్యర్థిత్వంపై జగన్ అసక్తిగా ఉన్నారని.. ఈ దఫా ఆమెను గుంటూరు లోక్ సభ స్థానంనుంచి బరిలోకి దింపాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది.
కాగా... గత ఎన్నికల సమయంలోనే జహారాబేగంను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. అయితే.. నాడు ఎందుకనో ఆ టెక్కెట్ ఆమె చేజారింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఈసారి గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది. పైగా ఇప్పటికే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ముసాఫా కుమార్తెకు కేటాయించిన నేపథ్యంలో... ఈ ఎంపిక వాళ్లకు కూడా మ్యూచువల్ గా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారని సమాచారం!