గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి 'జైలుశిక్ష'
కోర్టు ఆదేశాల్ని పాటించని నేపథ్యంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న కీర్తికి నెల రోజులు జైలు.. రూ.2వేల జరిమానాను విధిస్తూ తాజాగా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By: Tupaki Desk | 13 Dec 2023 4:43 AM GMTముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారు తరచూ చేసే తప్పునే గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న కీర్తి చేశారు. న్యాయ సంబంధిత అంశాల అమలులో ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోని తీరుకు ఆమె ఇప్పుడు మూల్యం చెల్లించే పరిస్థితి. కోర్టు ఆదేశాల్ని పాటించని నేపథ్యంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న కీర్తికి నెల రోజులు జైలు.. రూ.2వేల జరిమానాను విధిస్తూ తాజాగా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వైనం సంచలనంగా మారింది.
ఇంతకూ ఆమె చేసిన నేరం ఏమిటన్నది చూస్తే.. హైకోర్టు ఆదేశాల్ని పాటించకపోవటమే. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రం ఉంది. దాన్ని అక్రమంగా అక్రమించుకొని ఎలాంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ ను నడుపుతున్నట్లుగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్ లకు రూ.25 లక్షల మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాల అమలులో మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల్ని అమలు చేయని గుంటూరు మున్సిపల్ కమిషనర్ తీరును ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్ట.. మున్్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజులు జైలుశిక్ష రూ.2వేల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ీ తీర్పును అనుసరించి జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి తిప్పలు తెచ్చుకునే కన్నా.. కోర్టు ఆదేశాల్ని అమలు చేస్తే సరిపోతుంది కదా? మరి..ఈ గడువు లోపు ఆమె ఏం చేస్తారో చూడాలి.