వైసీపీ వర్సెస్ టీడీపీ.. గుంటూరులో ఈ క్వేషన్ వర్కవుట్ అవుతుందా?
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య పోరు ఓ రేంజ్‌లో ఉండే అవకాశాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు
By: Tupaki Desk | 10 Feb 2024 9:15 AM GMTఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య పోరు ఓ రేంజ్‌లో ఉండే అవకాశాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎంతమంది పోటీ చేసినా.. ఈ రెండు పార్టీలు(టీడీపీ-జనసేన పొత్తు) హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే.. వైసీపీ వేస్తున్న వ్యూహాలను గమనిస్తే.. టీడీపీ ఆ రేంజ్‌లో ముందుకు సాగలే కోపోతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఉదాహరణకు గుంటూరు పార్లమెంటు స్థానాలను తీసు కుంటే.. వైసీపీ ఈ దఫా గుంటూరులోని మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల ప్రయోగాలు చేస్తోంది.
గుంటూరు పార్లమెంటు స్థానం, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్‌లో సంచలన నిర్ణయా లు తీసుకుంది. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కాపు నాయకుడు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు కుమారుడు.. ఉమ్మారెడ్డి వెంకటరమణకు ఇచ్చింది. ఇది క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా సంచలన నిర్ణయమనే చెప్పాలి. ఇప్పటి వరకు గుంటూరు ఎంపీ టికెట్‌ను ఈ సామాజిక వర్గానికి ఇటీవల నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా కేటాయించలేదు.
దీంతో గుంటూరు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలపైనా ఈ ప్రభావం ఉండనుంది. ఇక, ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ మరోసారి కమ్మ నేతకు అవకాశం ఇచ్చింది. ఎన్నారై టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు టికెట్ ప్రకటించింది.(అధికారికంగా రావాల్సి ఉంది). గతంలోనూ కమ్మ నాయకుడు గల్లా జయదేవ్ కే పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా వైసీపీ మార్చిన ఈ క్వేషన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.
అదేవిధంగా నరసారావుపేటలోనూ.. వైసీపీ ప్రయోగం చేసింది. ఇక్కడ నుంచి ఏకంగా బీసీ యాదవ వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌కు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏపార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అలాంటిది తొలిసారి వైసీపీ ప్రయోగం చేసింది. ఇక, ఇక్కడ టీడీపీ మరోసారి కమ్మ నేతకే అవకాశం ఇచ్చింది. అది కూడా వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరా యులుకే ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. దీంతో వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.