Begin typing your search above and press return to search.

తిరుపతి : ఇంత భారీ క్రాస్ ఓటింగ్ ఎలా సాధ్యం!

ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి ఓటమితో పాటు తిరుపతి లోక్ సభలో వైసీపీ గెలుపు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 7:26 AM GMT
తిరుపతి : ఇంత భారీ క్రాస్ ఓటింగ్ ఎలా సాధ్యం!
X

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో 151 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలు గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయింది. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి ఓటమితో పాటు తిరుపతి లోక్ సభలో వైసీపీ గెలుపు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది.

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు మీద 14569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కేవలం 65523 ఓట్లకు పరిమితం కావడం విశేషం. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయినా గురుమూర్తి గెలుపు ఆయన మంచితనమే అని చెబుతున్నారు.

తిరుపతి శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థి శ్రీనివాసులు ఏకంగా 61956 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. సూళ్లూరుపేటలో 29,115, శ్రీకాళహస్తిలో 43,304, వెంకటగిరిలో 16,294, గూడూరులో 21,191, సర్వేపల్లిలో 16,288 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇంత భారీ క్రాస్ ఓటింగ్ ఎలా సాధ్యం అయింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.