Begin typing your search above and press return to search.

మహిళను మర్డర్ చేసిన జిమ్ ట్రైనర్... సీసీ ఫుటేజ్ లో సంచలన దృశ్యాలు!

ఉత్తరప్రదేశ్ వ్లోని కాన్పూర్ జిమ్ లో ఉన్న మహిళను ఆమె జిమ్ ట్రైనర్ హత్య చేసీ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:37 AM GMT
మహిళను మర్డర్  చేసిన జిమ్  ట్రైనర్... సీసీ ఫుటేజ్ లో సంచలన దృశ్యాలు!
X

జిమ్ లో సభ్యురాలిగా ఉన్న ఓ మహిళను జిమ్ ట్రైనర్ హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన వేళ.. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లో తాజాగా సంచలన విషయాలు వెలుగు చూశాయి! దీనికి గల కారణాలు, ఆ మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు తీవ్ర సంచలనంగా మారాయి. దీనిపై పోలీసులు వివరాలు వెల్లడించారు.

అవును... ఉత్తరప్రదేశ్ వ్లోని కాన్పూర్ జిమ్ లో ఉన్న మహిళను ఆమె జిమ్ ట్రైనర్ హత్య చేసీ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆమెను హత్య చేసిన రోజే మృతదేహాన్ని వీవీఐపీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు చూపుతున్న సీసీటీవీ ఫుటేజీ బయటపడిందని చెబుతున్నారు. ఇందులో.. బ్లాక్ ఫ్యాంట్, రెడ్ టీషర్ట్ ధర్మించిన ఉన్న మహిళ జిమ్ లోపల కనిపిస్తుంది.

హత్యకు గురైన ఆమె మృతదేహాన్ని సుమారు నాలుగు నెలల తర్వాత కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బంగ్లా దగ్గర నుంచి వెలితికీసినట్లు చెబుతున్నారు. గ్రీన్ పార్క్ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులకు కేటాయించిన బంగ్లాలతో కూడిన ప్రాంతంలో ఆ మృతదేహాన్ని పాతిపెట్టినట్లు నిందితుడు విమల్ సోనీ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.

మృతురాలు స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త భార్య కాగా.. ఆమె జూన్ 24నుంచి కనిపించకుండాపోయింది. ఆమె మృతదేహాన్ని పాతిన చోటు పక్కనే సెక్యూరిటీ పోస్ట్ కూడా ఉందని అంటున్నారు. ఈ చోటు.. జిమ్ సెంటర్ కు కిలోమీటర్ దూరంలో ఉంది. ఆమె ఈ జిమ్ లో సుమారు రెండున్నరేళ్లుగా సభ్యురాలిగా ఉందని తెలుస్తోంది.

ఈ విషయాలపై స్పందించిన నార్త్ కాన్పూర్ డీసీపీ... అతడికి పెళ్లి నిశ్చయమవ్వడంతో ఆ మహిళ కలత చెందిందని చెబుతున్నారు! సుమారు 20 రోజుల తర్వాత ఆమె జిమ్ కి వచ్చిన రోజు నేరం జరిగిందని వెల్లడించారు! ఆమె జిమ్ కి వచ్చిన తర్వాత మాట్లాడటానికని ఇద్దరూ కారులో వెళ్లారని చెబుతున్నారు.

అనంతరం ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగిందని.. దీంతో అతడు ఆమె మెడపై కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు! ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.