Begin typing your search above and press return to search.

బిట్ కాయిన్ కు హ్యాకింగ్ ఎఫెక్ట్... షాకింగ్ రిజల్ట్!

వాస్తవానికి అమెరికాలో స్పాట్‌ బిట్‌ కాయిన్‌ ఈటీఎఫ్‌ లకు అనుమతిపై ఈ వారం ఎస్‌.ఈ.సీ నుంచి కీలక ప్రకటన వస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 7:15 AM GMT
బిట్  కాయిన్  కు హ్యాకింగ్  ఎఫెక్ట్... షాకింగ్  రిజల్ట్!
X

హ్యాకింగ్‌ కి కాదేదీ అనర్హం అని భావిస్తుంటారు హ్యాకర్స్! పలు సందర్భాల్లో కీలక విషయాల్లో ఎంటరై పరిస్థితులను తలకిందులు చేసేస్తుంటారు.. ఫలితాలను తారుమారు చేసేస్తుంటారు.. ఫలితంగా జీవితాలతో ఆడేసుకుంటారు! ఈ క్రమంలోనే తాజాగా బిట్ కాయిన్ హ్యాకింగ్ కి గురైంది. ఎస్.ఈ.సీ.లో ఈ ఖాతాను దుండగులు హ్యాక్ చేశారు. ఫలితంగా వ్యవహారం తారుమారైపోయింది.

అవును... అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (ఎస్‌.ఈ.సీ) ట్విట్టర్ ఖాతాను అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం సమయంలో దుండగులు హ్యాక్‌ చేశారు. ఇందులో భాగంగా... "అన్ని రిజిస్టర్డ్‌ నేషనల్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛెంజ్ లలో నమోదు చేసుకోవడానికి బిట్‌ కాయిన్‌ ఈటీఎఫ్‌ లకు అనుమతి మంజూరు చేస్తున్నాం" అని తప్పుడు పోస్టు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

వాస్తవానికి అమెరికాలో స్పాట్‌ బిట్‌ కాయిన్‌ ఈటీఎఫ్‌ లకు అనుమతిపై ఈ వారం ఎస్‌.ఈ.సీ నుంచి కీలక ప్రకటన వస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు అసెట్‌ మేనేజ్మెంట్‌ కంపెనీలు దీనిపై ఎస్‌.ఈ.సీకి పలు మార్లు విజ్ఞప్తి కూడా చేశాయి. సరిగ్గా ఈ సమయంలో ట్విట్టర్ వేదికగా ప్రకటన రావడంతో ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.

దీంతో మార్కెట్లో బిట్‌ కాయిన్‌ ధర ఏకంగా 2,000 డాలర్లు పెరిగి.. 48,000 డాలర్లకు చేరింది. అనంతరం ఎస్‌.ఈ.సీ ఛైర్మన్‌ గ్యారీ జెన్సలర్‌ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఎస్‌.ఈ.సీ అఫీషియల్ ఖాతా హ్యాక్‌ అయినట్లు ప్రకటించారు. బిట్‌ కాయిన్‌ ఈ.టీ.ఎఫ్‌. లకు ఎస్‌.ఈ.సీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో బిట్ కాయిన్ ధర తిరిగి 46,000 డాలర్లకు చేరుకొంది.

దీంతో ఈ ట్వీట్ కి రిప్లైగా నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా "మీ ట్విట్టర్ ఖాతానే ప్రొటక్ట్ చేసుకోలేనివారు.. ఇన్వెస్టర్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు" అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది “ఇది ఎస్.ఈ.సీ. మార్కెట్ మానిప్యులేషన్” అని స్పందిస్తున్నారు.