Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... ఢిల్లీ బస్సులో అమ్మాయి అసభ్యకరమైన చర్య!

ఇదే సమయంలో ఢిల్లీలో పబ్లిక్ బస్సులో ఒక అసభ్యకరమైన సంఘటన వెలుగు చూసింది

By:  Tupaki Desk   |   18 April 2024 4:19 AM GMT
వైరల్ వీడియో... ఢిల్లీ బస్సులో అమ్మాయి అసభ్యకరమైన చర్య!
X

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఉంటుంటుంది! సభ్యసమాజం ఏమనుకుంటుందో అనే ఇంగితం ఏమాత్రం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ పేరున కొంతమంది అమ్మాయిలు ఇటీవల చేసిన రచ్చ సంగతి తెలిసిందే! ఇదే సమయంలో ఢిల్లీలో పబ్లిక్ బస్సులో ఒక అసభ్యకరమైన సంఘటన వెలుగు చూసింది.

అవును... భారతదేశంలో ప్రతీ పౌరుడికీ తినే తిండి, ధరించే దుస్తుల విషయంలో స్వేచ్చ ఉన్న మాట వాస్తవమే కానీ... అది శృతిమించితే, సమాజాన్ని ఇబ్బందులకు గురిచేసేది అయితే మాత్రం ఇబ్బందులు తప్పవనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో ఢిల్లీ పబ్లిక్ బస్సులో ఒక షాకింగ్ దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక యువతి తన లోదుస్తులు.. బ్రా, ప్యాంటీలు తప్ప మరేమీ ధరించకుండా రద్దీగా ఉండే పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఈ సమయంలో పిల్లలు, పురుషులు, మహిళలు అనే తారతమ్యాలు లేకుండా అంతా సమానంగా ఇబ్బందిపడ్డారనే చెప్పాలి. ఈ సమయంలో కొంతమంది ఆమెను చూసిన తర్వాత బస్సు దిగిపోవడం కనిపించింది!

ఈ పరిస్థితుల్లో బస్ కండక్టర్ కూడా ఏమీ తెలియనట్లు, ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నట్లు తెలుస్తుంది! ఈ సమయంలో సదరు మహిళ ప్రవర్తన పూర్తిగా అసభ్యకరంగా పరిగణించబడింది! లోదుస్తులు ధరించి పబ్లిక్ బస్సులో ప్రయాణించడం తనకే కాదు, అలాంటి ప్రవర్తనను చూసే ఇతర ప్రయాణికులకు కూడా అగౌరవంగా ఉంటుందనే విషయం గ్రహించాలని కోరుతున్నారు!