Begin typing your search above and press return to search.

పొట్టను చీల్చి బిడ్డను చంపి... వెలుగులోకి హమాస్ నరరూప రాక్షసత్వం!

హమాస్ పై ఇజ్రాయేల్ యుద్ధం చేస్తుంది. ఇలా ఇజ్రాయేల్ యుద్ధం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఆ దేశంపై హమాస్ ముష్కరులు ఉగ్రదాడి చేశారు

By:  Tupaki Desk   |   14 Oct 2023 3:48 AM GMT
పొట్టను చీల్చి బిడ్డను చంపి... వెలుగులోకి హమాస్ నరరూప రాక్షసత్వం!
X

హమాస్ పై ఇజ్రాయేల్ యుద్ధం చేస్తుంది. ఇలా ఇజ్రాయేల్ యుద్ధం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఆ దేశంపై హమాస్ ముష్కరులు ఉగ్రదాడి చేశారు. శనివారం తెల్లవారు జామునుంచి ఇజ్రాయేల్ ప్రతి దాడులు చేసేవారకూ హమాస్ ఉగ్రవాదులు చేసిన మారణహోమ, రాక్షస చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకూ వెలుగు చూసిన సంఘటనలు ఒకెత్తు, తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సంఘటన మరొకెత్తు అన్నా ఆశ్చర్యం లేదు!

అవును... మ్యూజిక్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు చేసిన దారుణాల సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ వద్ద కాపుకాసి, వెంటాడి, శవాలమధ్య పడున్నవారి శ్వాసను చెక్ చేసిమరీ కాల్చి చంపిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే అత్యంత దారుణమైన సంఘటన హమాస్ దాడులు ప్రారంభమైన తొలిరోజు జరిగాయి. మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ప్రాంతానికి సమీపంలో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు మృతదేహాలను సేకరించే జాకా అనే సంస్థ ఉంది. అందులో గత గత 33 ఏళ్లుగా ఇజ్రాయెల్‌ లోని అష్‌ దోద్‌ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ అనే వ్యక్తి వాలంటీర్ గా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరుగుతున్న యుద్ధంలోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఈ 33 ఏళ్ల కెరీర్ లో తాను ఎన్నడూ చూడని ఒక దారుణమైన సంఘటన గురించి మీడియాకు చెప్పారు.

ఇందులో భాగంగా హమాస్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ గర్భిణి మృతదేహాన్ని చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదట. కారణం... ఆ తల్లి పొట్టను చీల్చి మరీ లోపలున్న బిడ్డను చంపడం తీవ్ర ఉద్వేగానికి గురిచేసిందంట. ఇలాంటి ఒళ్లు గగ్గురుపొడిచే సంఘటనలను, గతంలో తాను ఎన్నడూ చూడని విషయాలను అంతర్జాతీయ మీడియాకు వివరించారు యోసి లాండౌ!

ఈ నేపథ్యంలో... శనివారం ఉదయం హమాస్ ఉగ్రవాదుల రాకెట్ల దాడుల నేపథ్యంలో మోగిన సైరన్ల శబ్దాలు విని ఉలిక్కిపడి లేచినట్లు తెలిపారు యోసి లాండౌ. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్‌ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని తెలవడంతో దాడి జరిగిన ప్రాంతాల్లో మృతదేహాలను సేకరించేందుకు బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరగా.. ఆ దారిలో కనిపించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేశాయని గుర్తుచేసుకున్నారు.

ఇందులో భాగంగా... సాధారణంగా ఒక రోడ్డును దాటడానికి 15 నిమిషాల సమయం పట్టే ప్రాంతంలో పడిఉన్న ప్రతి మృతదేహాన్ని బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు సమయం పట్టిందంట. దీంతో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని.. ఆ స్థాయిలో రోడ్లపై శవలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు వాలంటీర్ యోసి లాండౌ.

అనంతరం అక్కడ నుంచి గాజాకు కేవలం 5 కి.మీ. సమీపంలో ఉండే బీరీ ప్రాంతానికి చేరుకోగానే ఓ ఇంట్లో కనిపించిన దృశ్యం ఇంకా కళ్లముదు కనిపిస్తుందని చెప్పిన యోసి లాండౌ... ఆ ఇంట్లోకి వెళ్లగానే ఒక మహిళ మృతదేహం కనిపించిందని.. అది చూడగానే ఆ బృందం మొత్తానికి సృహకోల్పోయినంత పని జరిగిందని తెలిపారు. కారణం... గర్భవతి అయిన ఆమె పొట్టను చీల్చి.. కడుపులో ఇంకా బొడ్డుతాడు సైతం తెగని ఆ బిడ్డను పొడిచి చంపారట. ఈ విషయం చెబుతూ తీవ్ర ఆవేదనతో కన్నీటిపర్యంతమయ్యాడు వాలంటీర్ యోసి!

ఇలా... ఈ వివరాలు బయట ప్రపంచానికి చెప్పడంతో హమాస్ ఉగ్రవాదుల దారుణాలు, అకృత్యాలు, నరరూప రాక్షసత్వం తాలూకు పరిపూర్ణ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి! ఈ విషయం తెలిసి ప్రపంచంలో మానవత్వం ఉన్నవారంతా... హమాస్ చర్యను ఖండిస్తున్నారని, వారి అంతాన్ని కోరుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... శనివారం నుంచి ఇజ్రాయేల్ – హమస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇరువైపులా మృత్యువాతపడ్డ వారి సంఖ్య 2,800 దాటిందని తెలుస్తుంది. ఈ మృతుల్లో ఇజ్రాయెలీలు 1,300 మందికిపైగా ఉండగా.. వారిలో 247 మంది సైనికులు ఉన్నారు.