Begin typing your search above and press return to search.

దీన్ని యుద్ధం అనకూడదేమో.. పసిపిల్లల్ని ఊచకోత కోసేశారు

యుద్ధం పేరుతో అమానుషాలు చేసే వారికి కొదవ లేదు. ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఒక పద్దతి పాడు ఉంటుందన్న విషయానని మర్చిపోయారు హమస్ ఉగ్రమూకలు

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:01 AM GMT
దీన్ని యుద్ధం అనకూడదేమో.. పసిపిల్లల్ని ఊచకోత కోసేశారు
X

యుద్ధం పేరుతో అమానుషాలు చేసే వారికి కొదవ లేదు. ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఒక పద్దతి పాడు ఉంటుందన్న విషయానని మర్చిపోయారు హమస్ ఉగ్రమూకలు. ప్రపంచంలో చాలామందికి నచ్చకపోవచ్చు కానీ.. ఇజ్రాయెల్ పౌరుల్ని చంపే విషయంలో హమస్ ఉగ్రవాదులకు వారికంటూ ఒక వాదన ఉంటుంది. అయితే.. అదెలాంటిదైనా కావొచ్చు. పసిపిల్లల్ని దారుణంగా హతమార్చిన దురాగతం చూసినప్పుడు.. వారిని దేవుడు కూడా క్షమించడన్న భావన కలుగక మానదు.

ఇప్పటివరకు ఇజ్రాయెల్ మీద హమస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడుల్ని.. దురాగతాల్ని యుద్దంగా చెబుతున్నప్పటికీ.. వారి చేష్టల్ని చూస్తే.. పైశాచిక దాడులుగా చెప్పకతప్పదు. హమస్ ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడుల్లో ఏ పాపం తెలియని 40 మంది చిన్నారుల ప్రాణాల్ని అత్యంత ఘోరంగా తీశారు. కెఫర్ అజా కిబుట్జ్ లో వారి డెడ్ బాడీలను గుర్తించినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది.

అందులో కొన్నింటికి తలలు కూడా లేకపోవటం చూస్తే.. వారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. ఈ ప్రాంతంలోనే హమస్ ఉగ్రమూక.. ఇజ్రాయెల్ లోని ఈ ప్రాంతంపైన దాడి చేసింది. విదేశీ మీడియా సంస్థలను ఈ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ రక్షణ దళం అనుమతించింది. ఈ ప్రాంతంలో పర్యటించిన ఒక పాత్రికేయుడు మాట్లాడుతూ.. తాను కొందరు సైనికులతో మాట్లాడినట్లుగా చెబుతూ.. ఈ ప్రాంతంలో వెళుతున్నప్పుడు సైనికులకు తలలు లేని చిన్నారుల డెడ్ బాడీలు.. మంచాల మీదే కాలి ఉన్న మ్రతదేహాల్ని చూసినట్లుగా పేర్కొన్నారు.

ఇదంతా చూస్తున్నప్పుడు.. అక్కడ జరిగింది యుద్ధం అసలే కాదని.. అదంతా ఊచకోతగా అభివర్ణిస్తున్నారు. కాలిపోయిన ఇళ్లు.. కార్లలో పడి ఉన్న డెడ్ బాడీలతో పాటు.. తల్లి పిల్ల అన్న తేడా లేకుండా తలలు నరికేసిన వైనాలు కనిపిస్తున్నాయి. అమాయక ప్రజల్ని ఎంత భయంకరంగా చంపారో వారి డెడ్ బాడీల్ని చూస్తే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ మేజర్ జనరల్ ఇటావ్ వెరువ్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇంత దారుణాన్ని చూడలేదన్నారు.

ఇంత అరాచకంగా సాటి మనుషుల్ని చంపిన ఉదంతాలు చరిత్రలో యూరప్ తో పాటు కొన్ని దేశాల్లో ఉన్నట్లుగా తమ తాత.. ముత్తాతలు చెప్పేవారని.. ఆధునిక చరిత్రలో ఇలాంటివి చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. యుద్ధం చేసే పద్దతి ఇది కాదని.. చిన్నారులతో సహా అమాయక ప్రజల్ని యుద్దం పేరుతో దారుణంగా చంపేయటం ఏమిటంటూ ఇజ్రాయెల్ మాజీ రాయబారి డానీ డానస్ పేర్కొంటూ.. ‘వారిని వెంటాడి.. వేటాడి ఈ భూమి మీద లేకుండాచేస్తాం’ అంటూ భీకర ప్రతిన చేశారు.