Begin typing your search above and press return to search.

కుక్కలను కూడా వదలని హమాస్... తెరపైజాంబీ సినిమా సీన్లు!

దేశానికీ దేశానికీ మధ్య జరిగే యుద్ధంలో సైనికులకు సైనికులకూ మధ్య పోరాటంలో యుద్ధనీతి ఉంటుందని అంటారు

By:  Tupaki Desk   |   12 Oct 2023 7:54 AM GMT
కుక్కలను కూడా వదలని హమాస్... తెరపైజాంబీ సినిమా సీన్లు!
X

దేశానికీ దేశానికీ మధ్య జరిగే యుద్ధంలో సైనికులకు సైనికులకూ మధ్య పోరాటంలో యుద్ధనీతి ఉంటుందని అంటారు. మినిమం మోరల్స్ అక్కడ కనిపిస్తాయని చెబుతారు. కానీ... ప్రస్తుతం ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అవి మచ్చుకైనా కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హమాస్ ముష్కరులు చేస్తున్న అకృత్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయనే సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.

అవును... ఇజ్రాయేల్ ప్రజలపై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడుల వీడియోలు ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఒక ఘటన వైరల్ గా మారింది. ఇందులో ఉగ్రవాదులు ఓ ఇంట్లో చొరబడగా... వారిని ఒక పెంపుడు కుక్క వెంబడించింది. దీంతో ఆ కుక్కను దారుణంగా కాల్చి చంపారు ముష్కరులు.

అనంతరం ఆ ఇంటికి నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదంతా వారి బాడీ క్యాం లో రికార్డ్ అవ్వగా... మూగజీవాలపై కూడా ఇంత కౄరంగా, ఆటవికంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోల కింద హార్ట్ బ్రేకింగ్ అనే కామెంట్లు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో... చిన్నారులు, మహిళల చేతులకు సంకెళ్లు వేసి మరీ కాల్చి చంపుతున్న దృశ్యాలు జాంబీ సినిమా సీన్లను తలపిస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే వందల సంఖ్యలో మహిళలు, పిల్లలు, వృద్ధులను బంధీలుగా చేసుకున్నారు. ఈ విషయాలపై తాజాగా ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్స్‌) స్పందించింది.

ఇందులో భాగంగా... చిన్నారుల తలలు తెగనరికారు.. మహిళలు, పిల్లల చేతికి సంకెళ్లు వేసి వారి తలలపై కాల్పులు జరిపి చంపేశారు.. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు ఆ దారుణాలను స్వయంగా చూసి చెప్పారు.. హమాస్‌ దాడులకు పాల్పడిన ప్రాంతాలకు ఇజ్రాయెల్‌ బలగాలు వెళ్లి చూస్తే అక్కడ జాంబీ సినిమాలాంటి భయానక దృశ్యాలు కన్పించాయి" అని ఐడీఎఫ్‌ అధికార ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణాలపై ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పందించారు. ఇందులో భాగంగా... హమాస్‌ అనేక అకృత్యాలకు పాల్పడింది.. అమ్మాయిలపై అత్యాచారాలు చేసి చంపేశారు.. మహిళలు, పురుషులను సజీవ సమాధి చేశారు.. సైనికుల తలలు తెగ నరికి చంపారు.. అని ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం... అతిత్వరలో గాజాలో క్షేత్రస్థాయిలో దాడులు చేపడతాం అని చెప్పిన నెతన్యాహు... హమాస్‌ గ్రూప్‌ ఉనికి ఈ భూమిపైనే లేకుండా చేస్తామని శపథం పూనారు! జరుగుతున్న ఘోర కలికి ప్రతి హమాస్‌ సభ్యుడు మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. ఇదే సమయంలో... వారు అసలు మనుషులు కాదని.. వారిని నలిపేస్తామని అని నెతన్యాహు ఘాటుగా హెచ్చరించారు.