Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించిన హర్ధిక్ పాండ్యా ఆ ఒక్క పోస్ట్

హార్దిక్ పాండ్యా రికార్డుల వేట కొనసాగుతోంది. ఈసారి మాత్రం గ్రౌండ్‌లో కాదు, సోషల్ మీడియాలో!

By:  Tupaki Desk   |   13 March 2025 10:35 AM IST
సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించిన హర్ధిక్ పాండ్యా ఆ ఒక్క పోస్ట్
X

హార్దిక్ పాండ్యా రికార్డుల వేట కొనసాగుతోంది. ఈసారి మాత్రం గ్రౌండ్‌లో కాదు, సోషల్ మీడియాలో! ఛాంపియన్స్ ట్రోఫీలో తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అతను షేర్ చేసిన ఓ ఫోటో అత్యంత వేగంగా 1 మిలియన్ (10 లక్షలు) లైక్స్ అందుకుని చరిత్ర సృష్టించింది.

హార్దిక్ క్రేజ్: ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు

న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత, టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీతో ఫొటోలు దిగారు. హార్దిక్ కూడా ట్రోఫీని తీసుకుని పిచ్‌పైకి వెళ్లి, ట్రోఫీని భూమిపై ఉంచి ఐకానిక్ స్టైల్లో ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే లైక్స్ వెల్లువలా వచ్చాయి.

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్

ఈ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 6 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ సాధించింది. దీంతో, హార్దిక్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. 2024 టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లీ తన రిటైర్మెంట్ ఫొటోను పోస్ట్ చేసినప్పుడు 7 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అయితే, హార్దిక్ ఈసారి కొత్త రికార్డు నెలకొల్పాడు.

ఫొటోలతోనూ వైరల్.. ఫీల్డ్‌లోనూ అదరగొట్టిన హార్దిక్

ఇది తొలిసారి కాదు, హార్దిక్ ఇంతకుముందు టీ20 ప్రపంచకప్‌ తరువాత కూడా ఇలాంటి ఫోజ్‌తో ఫొటో షేర్ చేసి వైరల్ అయ్యాడు. కానీ, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీతో దిగిన ఫోటో రికార్డులు తిరగరాస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ ప్రదర్శన

మైదానంలోనూ హార్దిక్ తన సత్తా చాటాడు. ఈ టోర్నమెంట్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 99 పరుగులు చేయడంతో పాటు, 4 వికెట్లు తీసి జట్టుకు కీలక సహాయంగా నిలిచాడు. ముఖ్యంగా, ఒత్తిడిలో భారీ షాట్లు ఆడి టీమిండియాను గెలుపు దిశగా నడిపించాడు. కొత్త బంతితోనూ మంచి బౌలింగ్ ప్రదర్శించి, షమితో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌కు 38.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆటలోనే కాదు, సోషల్ మీడియాలోనూ హార్దిక్ దూసుకెళ్తున్నాడు!