Begin typing your search above and press return to search.

విడాకుల వ్యవహారం... పాండ్యా ఇవ్వనున్న భరణం 70%?

ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ నెట్టింట హాట్ టాపిక్ గా మారారు హార్ధిక్.

By:  Tupaki Desk   |   25 May 2024 10:00 AM GMT
విడాకుల వ్యవహారం... పాండ్యా ఇవ్వనున్న భరణం 70%?
X

గత కొన్ని రోజులుగా టీం ఇండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కి సంబంధించిన వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను తప్పించి హార్ధిక్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై ఎంఐ ఫ్యాన్స్ నెట్టింట హల్ చల్ చేశారు. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ నెట్టింట హాట్ టాపిక్ గా మారారు హార్ధిక్.

అవును... హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అయితే దీనికి కారణం క్రికెట్ విషయం కాకుండా... తన వ్యక్తిగత జీవిత విషయాలకు సంబంధించి కావడం గమనార్హం. ప్రస్తుతం హార్ధిక్.. తన భార్య నటాసా స్టాంకోవిచ్‌ తో విడిపోతున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ.. ఇటు నటాషా నుంచి కానీ ఎటువంటి అధికారిక రియాక్షన్ లేదు.

ఇదే సమయంలో... పాండ్యా తన ఆస్తిలో 70శాతం వాటాను నటాషాకు ఇవ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ పై ఒక యూజర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... భార్య పుట్టిన రోజైన మార్చి 4న హార్ధిక్ పాండ్యా ఎలాంటి పోస్టూ చేయలేదు.. ఇదే సమయంలో ఐపీఎల్ లో పాండ్యాకు సపోర్ట్ చేసేందుకు ఆమె ఒక్కసారీ స్టేడియంకు రాలేదు అని రాసుకొచ్చాడు.

కాగా... ముంబైలోని ఓ హోటల్‌ లో హార్దిక్ పాండ్యా, నటాసాకు పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని చెబుతారు. 2018లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ... 2020 న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దుబాయ్‌ లో స్పీడ్‌ బోట్‌ లో విహరిస్తూ.. నటాసాకు హార్దిక్ రింగ్ తొడిగాడు.

అదే ఏడాది లాక్‌ డౌన్‌ లో తాము తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించారు పాండ్యా దంపతులు. 2020 జులైలో ఆగస్త్యకు వారు జన్మనిచ్చారు. ఈ క్రమంలో తాజాగా నటాసా తన ఇన్‌ స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ లో హార్దిక్ పాండ్యా పేరు తొలగించడంతో.. వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయనే ప్రచారం నెట్టింట మొదలైంది. ఈ క్రమలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని.. హార్దిక్ ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా తీసుకుంటున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి!