Begin typing your search above and press return to search.

నువ్వే నా క్రైమ్ పార్ట్నర్.. కొడుకు పై హార్దిక్ ఎమోషనల్ పోస్ట్..

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అతని అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తుంది

By:  Tupaki Desk   |   30 July 2024 7:05 AM GMT
నువ్వే నా క్రైమ్ పార్ట్నర్.. కొడుకు పై హార్దిక్ ఎమోషనల్ పోస్ట్..
X

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అతని అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ప్రస్తుతం అతను తన కొడుకుకు దూరంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ వేదికగా కొడుకు అగస్త్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రికెటర్ పెట్టిన వీడియో వైరల్ అయింది.

ఈ వీడియోలో చిన్ని అగస్త్య తన తండ్రి చేస్తున్న పనులను ఇమిటేట్ చేయడం మనం చూడవచ్చు. హార్దిక్ అతని కొడుకుకి ఫ్లయింగ్ కిస్సెస్ ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని నేర్పిస్తున్న క్లిప్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. హార్దిక్ చేసింది చూసి అలాగే చేయడానికి ప్రయత్నిస్తున్న అగస్త్య చాలా క్యూట్ గా ఉన్నాడు. ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ‘జెంగా’ అనే గేమ్ ని కూడా ఆడారు. కొడుకు చేసే అల్లరి పనులకు హార్దిక్ కళ్ళల్లో ఎక్కడలేని సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియోని షేర్ చేస్తూ హార్దిక్ ఓ ఎమోషనల్ నోట్ ని కూడా జత చేశాడు.”ప్రతిరోజు నా బలానికి మీరే మూలం.. నా క్రైమ్ పార్ట్నర్.. నా చిట్టి ఆగు కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను.. ప్రేమిస్తూనే ఉంటాను”అంటూ హార్దిక్ ఆ వీడియో కింద ఓ హార్ట్ టచింగ్ నోట్ రాశాడు. జూనియర్ పాండ్యా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు నెటిజెన్లు హార్దిక్ పోస్టుని కూడా వైరల్ చేశారు.

2018లో ముంబైలోని నైట్‌క్లబ్‌లో మొదటిసారి నటాసాను కలిసిన హార్దిక్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2020 జనవరి 1న హార్దిక్ దుబాయ్ లో నటాసాతో వివాహ విషయాన్ని ప్రతిపాదించాడు. 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ జంట ఇంటి వద్దనే సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం జూలైలో అగస్త్య జన్మించాడు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత హార్దిక్ దంపతులు విడిపోతున్నట్టు పలు పుకార్లు వినిపించాయి.

అనంతరం జూలై 18 గురువారం నాడు ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని హార్దిక్ స్పష్ఠికరించారు. ప్రస్తుతం నటాసా సెర్బియాలో ఆమె కొడుకుతో కలిసి ఉంటున్నారు.

ప్రస్తుతం శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతున్న హార్దిక్ లంకలో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలవల్ల ప్రస్తుతం అతను వండే సిరీస్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొడుకును మిస్ అవుతూ హార్దిక్ పెట్టిన ఈ పోస్ట్ అందరి హృదయాలను కదిలిస్తోంది.