నాపై ఇన్ని కేసులా.. చిట్టా విప్పిన హరీష్‌రావు!
''నువ్వు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న నాపై.. నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నావు'' అని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 4 Dec 2024 2:30 AM GMTతెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నాయకుడు తన్నీరు హరీష్‌రావు... ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తనపై నమోదైన కేసు ల చిట్టాను విప్పి ఘొల్లుమన్నారు. ఆ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తనపై పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో కేసులు నమోదు చేసుకున్నా తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ''నీకు చేతనైంది ఇదే కదా!'' అంటూ రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న తనను టార్గెట్ చేసుకున్నారని దుయ్యబట్టారు. అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
తప్పుడు కేసులు పెట్టి వేధించడం రేవంత్‌కు అలవాటైందని విమర్శించారు. ''నువ్వు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న నాపై.. నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నావు'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రభుత్వ పాలనలో తప్పులు ఎత్తి చూపుతున్నందుకు సహించలేక.. భరించలేక.. తప్పుడు కేసులు పెడుతున్నావంటూ.. నిప్పులు చెరిగారు. కాగా, పది నెలల కాలంలో తనపై నమోదైన కేసులను.. ఏయే అంశాల ప్రాతిపదికగా.. వాటిని నమోదుచేశారనే విషయాలను ఈ సంద ర్భంగా హరీష్‌రావు వివరించారు.
ఇవీ కేసులు..
1) యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో: రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేస్తున్నారన్న వ్యాఖ్యలపై కేసు
2) బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో: ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న ముఖ్యమంత్రి 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని అన్న వ్యాఖ్యలపై కేసు నమోదు.
3) సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో: సోషల్ మీడియాలో సర్కారుకు వ్యతిరేకంగా ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు కేసు.
4) మానకొండూరు పోలీసు స్టేషన్‌లో: బీఆర్ ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ.. చేసిన విమర్శలపై కేసులు.
5) పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో: రేవంత్ రెడ్డి రెండు నాల్కల వైఖరిని అవలంభిస్తున్నాడని అన్నందుకు కేసు పెట్టారని హరీష్‌రావు చెప్పుకొచ్చారు.