Begin typing your search above and press return to search.

హరీశ్ రావుకు ఏమైంది? ఎవరేం చేసుకున్నా రేవంతే బాధ్యత వహించాలా?

మాట్లాడే మాటలకు ఒక అర్థం పర్థం ఉండాలి. విన్నంతనే వికారం కలిగించే వాదనను వినిపించేలా చేస్తున్న గులాబీ అగ్రనేతల్లో ఒకరైన మాజీ మంత్రి హరీశ్ తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:04 AM GMT
హరీశ్ రావుకు ఏమైంది? ఎవరేం చేసుకున్నా రేవంతే బాధ్యత వహించాలా?
X

మాట్లాడే మాటలకు ఒక అర్థం పర్థం ఉండాలి. విన్నంతనే వికారం కలిగించే వాదనను వినిపించేలా చేస్తున్న గులాబీ అగ్రనేతల్లో ఒకరైన మాజీ మంత్రి హరీశ్ తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారం దూరమైన ఫస్ట్రేషన్ ను అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రతి విషయానికి ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యుడనేలా వాదనలు వినిపించటంలో అర్థం లేదనే చెప్పాలి. రాష్ట్రమన్నతర్వాత సవాలచ్చ అంశాలు చోటు చేసుకుంటాయా? రోజువారీగా ఏదో ఒక విషయాన్ని బూచిలా చూపించి.. దానికి ముఖ్యమంత్రిని బాధ్యత వహించాలంటూ విరుచుకుపడితే ప్రజలు ఏమనుకుంటారుఅన్న విషయాన్ని హరీశ్ ఎందుకు మర్చిపోతున్నారు?

ములుగు జిల్లాలో ఎస్ఐ.. సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం.. కామారెడ్డిలో ఎస్ఐ.. కానిస్టేబుల్.. సిరిసిల్లలో కానిస్టేబుల్ ఫ్యామిలీ.. మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. ఇలా స్వల్ప కాలంలోమరణించిన పోలీసుల అంశాన్ని రాష్ట్ర సమస్యగా పేర్కొంటూ హరీశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకుంటే.. ఈ ఆత్మహత్యల్లో చాలా వరకు కుటుంబ అంశాలు.. వ్యక్తిగత ఇష్యూలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

హరీశ్ వాదన ఏమంటే.. ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందన్న ట్వీట్ చూస్తే.. హరీశ్ తీరు షాకింగ్ గా మారిందని చెప్పాలి.

ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకున్నా.. పై అధికారుల వేధింపులకుగురి చేస్తున్నా.. వారు ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోతేనో.. అధికార పార్టీకి చెందిన నాయకుల బ్లాక్ మొయిలింగ్.. దూకుడుతనంతో ఇబ్బందులు పడుతూ.. వారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వేళలో.. హరీశ్ రావు ఇలాంటి ట్వీట్లు పెడితే అర్థముంటుంది.

మిగిలిన మరణాల్ని కాసేపు పక్కన పెట్టి.. రెండు రోజుల క్రితం ఎస్ఐ.. లేడీ కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయానికి కూడా రేవంత్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని కోరటం కాస్తంత సిత్రంగా లేదు. హరీశ్ లాంటి అగ్రనేత స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు.. విమర్శలు సూట్ అవుతాయా? అన్నది ప్రశ్న. ఎందుకైనా మంచిది హరీశ్ కాస్తంత అంతర్మధనం చేసుకుంటే బాగుండేమో కదా?