Begin typing your search above and press return to search.

ట్రంప్ టీమ్ లో మరో ఇండియన్-అమెరికన్... ఎవరీ హర్మీత్?

ఈ క్రమంలోనే తాజాగా మరో భారతీయ అమెరికన్ కు తన పాలకవర్గంలో చోటు కల్పించారు. పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా హర్మీత్ ను నియమించారు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 4:02 AM GMT
ట్రంప్  టీమ్  లో మరో ఇండియన్-అమెరికన్... ఎవరీ హర్మీత్?
X

ట్రంప్ 2.0 క్యాబినెట్ లో ఇప్పటికే ముగ్గురు (కాష్ పటేల్, తులసీ గబ్బర్డ్, వివేక్ రామస్వామి) ఉండగా... భారతీయ సంతతికి చెందిన నాల్గవ వ్యక్తి పేరు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా... హర్మీత్ కె.ధిల్లాన్ ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా నియమించారు. ఈ విషయాన్ని ట్రూత్ వేదికగా వెల్లడించారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి.. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ట్రంప్.. తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో భారతీయ అమెరికన్ కు తన పాలకవర్గంలో చోటు కల్పించారు. పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా హర్మీత్ ను నియమించారు.

ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా హర్మీత్ కె. ధిల్లాన్ ను నామినేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని.. తన వృత్తి జీవితంలో పౌర హక్కులను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేశారని తెలిపారు.

దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదుల్లో ఆమె ఒకరని.. కోవిడ్ సమయంలో ప్రార్థనలూ చేసుకోకుండా అడ్డుకోవడంపై న్యాయపరంగా పోరడారని.. ఈ కొత్త పదవిలో రాజ్యాంగ, పౌర హక్కులను, ఎన్నికల చట్టాలను న్యాయపరంగా అమలుచేస్తారని నమ్ముతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎవరీ హర్మిత్ ధిల్లాన్..?

భారతదేశంలోని చండీగఢ్ లో జన్మించిన హర్మీత్.. చినంతనంలోనే తల్లితండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమిటిక్స్ లో ఉన్నత పాఠశాల విద్యను.. అనంతరం.. డార్ట్ మౌత్ కాలేజీ నుంచి క్లాసికల్ లిటరేచర్ లో బీఏ డిగ్రీని అభ్యసించారు. తర్వాత వర్జీనియా యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పొందారు.

1993లో యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫోర్త్ సర్క్యూట్ లో క్లర్క్ గా చేరారు. ఆ తర్వాత 1994-1998 వరకూ షీర్మాన్ & స్టెర్లింగ్ లో అసోసియేట్ గా పనిచేశారు. ఈ క్రమంలో... 2006లో సొంతంగా ధిల్లాన్ లా గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడ్దాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవిలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.