Begin typing your search above and press return to search.

వీడెంత సైకో అంటే? జైలు నుంచి రిలీజైన 11 రోజుల్లో 5 మర్డర్లు

ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్న వీడిని త్వరలో హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఇంతకూ ఈ సైకో ఎవరు? ఎక్కడి వాడు. వీడి నేర చరిత్ర ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

By:  Tupaki Desk   |   28 Nov 2024 5:02 AM GMT
వీడెంత సైకో అంటే? జైలు నుంచి రిలీజైన 11 రోజుల్లో 5 మర్డర్లు
X

జైలు నుంచి విడుదలైన ఒక సైకో కిల్లర్ చేష్టల గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. పోలియోతో చచ్చుబడిన కాలును ఒక అవకాశంగా మలుచుకొని.. దొంగతనాలు.. అత్యాచారాలు.. హత్యలు చేసే వీడి గురించి తెలిస్తే నోట మాట రాదంతే. తాజాగా వీడిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడి సైకోతనానికి తెలుగు వారు సైతం బలయ్యారు. ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్న వీడిని త్వరలో హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఇంతకూ ఈ సైకో ఎవరు? ఎక్కడి వాడు. వీడి నేర చరిత్ర ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

హర్యానాకు చెందిన రాహుల్ జాట్ కు 29 ఏళ్లు. ఐదో ఏటనే పోలియో బారిన పడ్డాడు. దీంతో అతడి ఎడమకాలికి వైకల్యం ఏర్పడింది. 2018-19లో అతడిపై ట్రక్ దొంగతనం.. ఆయుధాల రవాణాపై రాజస్థాన్.. హర్యానా.. యూపీ.. ఉత్తరాఖండ్ లో కేసులు ఉన్నాయి. ఒక కేసులో జోద్ పూర్ పోలీసులు అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత ఈ నెల 14న గుజరాత్ లోని ఉద్వాడలో రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతున్న 19 ఏళ్ల యువతిని మామిడితోటలోకి లాక్కెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు డెడ్ బాడీ పక్కనే ఉన్న సంచిని స్వాధీనం చేసుకున్నారు.

అందులో ఉన్న దుస్తులు.. తాడు..కత్తిని గుర్తించి.. చుట్టుపక్కల ఉన్న ఐదు వేల సీసీ కెమేరాల ఫుటేజ్ ను వడబోశారు. చివరకు ఉద్వాడ స్టేషన్ లో గుర్తించారు. వీడి ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు.. జైళ్లకు పంపారు. చివరకు ఇతడ్ని గుర్తించి బాంద్రా - భుజ్ రైల్లో పట్టుకున్నారు. ఎవరినైనా చంపాలని డిసైడ్ అయిన తర్వాత రైలు ఎక్కే ఈ సైకో.. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తాడు. ఈ విధంగా పలువురిని ఇప్పటికే హత్య చేశాడు. ఇతడి దారుణాల బలైన అమాయకులకు న్యాయం చేసేందుకు మహారాష్ట్ర.. పశ్చిమ బెంగాల్.. కర్ణాటక.. గుజరాత్ పోలీసులు వీడి కోసం వెతుకుతున్నారు.

వీడి సైకోతనానికి కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ బలైంది. హైదరాబాద్ లో ఉండే తన పెద్దకుతూర్ని చూసేందుకు రైలెక్కిన ఆమె ఈ నెల 23న బెల్గావి - మణగూరు ట్రైన్ ఎక్కింది. తర్వాతి రోజున ట్రైన్ వద్దకు వెళ్లిన రమణమ్మ అల్లుడు.. తన అత్త దివ్యాంగుల కోచ్ లో మరణించినట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

ఇందులో భాగంగా యాదగిరి స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను టవల్ తో గొంతునులిమి చంపినట్లుగా తేల్చారు. రమణమ్మ ఫోన్ బెంగళూరులో స్విచ్చాఫ్ చేసినట్లుగా గుర్తించారు. అక్కడి పోలీసులు సీసీ కెమేరాలు తనిఖీ చేస్తుండగా.. ప్లాట్ ఫామ్ మీద కుంటుతూ నడుస్తున్న రాహుల్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ఈ నెల 29న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గుజరాత్ వెళ్లనున్నట్లుగా వెల్లడించారు.