Begin typing your search above and press return to search.

షర్మిళ ర్యాగింగ్ ఎక్కువ అయ్యిందా?

ఈ సమయంలో తాజాగా.. వదినమ్మ అంటూ వైఎస్ భారతి పేరు ప్రస్థావించడం గమనార్హం.

By:  Tupaki Desk   |   30 Jan 2024 9:20 AM GMT
షర్మిళ ర్యాగింగ్  ఎక్కువ అయ్యిందా?
X

ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ వైఎస్ షర్మిళ... ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతూ, రాబోయే ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే.. మరోపక్క వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్నారు! ఈ సందర్భంగా ప్రధానంగా ప్రత్యేక హోదా పేరు చెప్పి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. సెటైర్లు వేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా.. వదినమ్మ అంటూ వైఎస్ భారతి పేరు ప్రస్థావించడం గమనార్హం.

అవును... గతకొన్ని రోజులుగా మైకు పట్టుకున్న ప్రతీసారీ వైఎస్ జగన్ పై షర్మిళ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు వైసీపీ నేతలనుంచి ప్రతివిమర్శలు రావడంతో డోసు పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు జోకర్లు అంటూ ఫైరవుతున్నారు. ఈ సమయంలో సీఎం పదవి కోసం తాను సోనియా గాంధీతో మాట్లాడినట్లు చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు షర్మిళ.

ఇందులో భాగంగా... వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన భర్త సోనియా గాంధీ వద్దకు వెళ్లారని.. షర్మిళను ముఖ్యమంత్రిని చేయండని అడిగారని చెబుతున్నారని.. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా అని ఆమె ప్రశ్నించారు. నాడు అనిల్.. సోనియా గాంధీనికి కలిసింది ఒంటరిగా కాదని, తన వదినమ్మ భారతీ రెడ్డితోనే అని షర్మిళ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన భర్త సోనియాతో సీఎం పోస్ట్ గురించి మాట్లాడితే.. ఆ మాట నిజమైతే.. అది భారతమ్మ ముందు అడిగారా.. వెనుక అడిగారా అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... "ప్రణబ్ ముఖర్జీ ముందు అడిగినట్లు చెబుతున్నారు... ఇప్పుడు ఆయన లేరు, వచ్చి చెప్పలేరు కాబట్టి ఆయన ప్రస్థావన తెస్తున్నారు.. ఆయన కుమారుడైనా ఉన్నారు కదా.. ఆయనతో అయినా చెప్పించగలరా.. జోకర్లను తెరపైకి తెచ్చి ఇలా నాపై వక్తిగత విమర్శలు చేయిస్తున్నారు" అంటూ షర్మిళ ఫైరయ్యారు.

స్పెషల్ స్టేటస్ బీరు మాత్రం తెచ్చారు!:

ఈ సందర్భంగా ఏపీలో లిక్కర్ తాగడం వల్ల, లివర్ చెడిపోయి జరుగుతున్న చావులు.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే 25శాతం ఎక్కువగా ఉన్నాయని ఘణాంకాలు చెబుతున్నాయని షర్మిల తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది.. లేదా, కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది అని తెలిపారు. ఎక్కడా చూడని బ్రాండ్లు వచ్చాయని అన్నారు!

ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్‌ కు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలని జగన్‌ ను కోరితే... ఆయన స్పెషల్ స్టేటస్ తేలేదు కానీ... స్పెషల్ స్టేటస్ బీర్ మాత్రం తీసుకొచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో... ఏపీలో నకిలీ మద్యం బ్రాండ్‌ ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా... బూం బూం అనే బీరు పేరు చెప్పిన షర్మిళ... ఇలాంటి కొన్ని బ్రాండ్లు మాత్రమే ఏపీలో దొరుకుతాయని అన్నారు.