Begin typing your search above and press return to search.

పర పురుషులతో భార్య సెక్స్ చాట్... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

విడాకులకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   15 March 2025 3:00 AM IST
పర పురుషులతో భార్య సెక్స్  చాట్... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోన్న విడాకుల కేసులకు, పలు మర్డర్ కేసులకు వివాహేతర సంబంధాలే కారణం అనే వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సెక్సువల్ జెలస్ అనేది పలు క్రైమ్ లలో కీలక భూమిక పోషిస్తుందని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... పర పురుషులతో భార్య సెక్స్ చాట్ చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది!

అవును... వివాహం తర్వాత భర్త లేదా భార్య.. తన స్నేహితులతో "అసభ్యకరమైన" సంభాషణలు జరపకూడదని.. తన భార్య నుంచి అలాంటి చాట్ లను ఏ భర్త కూడా సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే... ఓ జంట 2018లో వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వివాహం తర్వాత ఆమె తన పాత ప్రేమికులతో మొబైల్ లో మాట్లాడేదని.. ఆమె జరుపుతున్న వాట్సప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ భర్త ఫిర్యాదు చేశాడు. అయితే... ఆ మహిళ తన భర్త వాదనలను తోసి పుచ్చింది. తనకు అలాంటి సంబంధం ఏదీ లేదని చెప్పింది.

అనంతరం... తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేహాలను ఇద్దరు వ్యక్తులను తన భర్తే పంపాడని.. అందుకు నా ఫోన్ ను హ్యాక్ చేశాడని.. తన భర్త చర్యలు తన గోప్యతా హక్కును ఉల్లంఘిస్తున్నాయని ఆ మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా... అతనిపై రూ.25 లక్షల కట్నం డిమాండ్ ఆరోపణను కూడా లేవనెత్తింది.

అయితే... అతని ఆరోపణల్లో నిజం ఉందని కోర్టు గ్రహించింది! పైగా తన కుమార్తెకు మగ స్నేహితులు ఉన్నారని ఆమె తండ్రి సాక్ష్యం ఇచ్చాడని తెలుస్తోంది! దీంతో... దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ గజేంద్ర సింగ్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సమర్ధించింది.

సదరు మహిళ తన పురుష స్నేహితులతో తన లైంగిక జీవితం గురించి చాట్ చేస్తోందని కోర్టు గమనించింది. ఈ సందర్భంగా.. తన భార్య ఈ రకమైన అసభ్యకరమైన చాట్ ద్వారా మొబైల్ ద్వారా సంభాషణలో ఉండటాన్ని ఏ భర్త కూడా సహించడని బెంచ్ పేర్కొంది!