Begin typing your search above and press return to search.

వారానికి 3 రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులపై చర్యలు.. హెచ్ సీఎల్ వార్నింగ్

దీంతో.. దిగ్గజ సంస్థలు కొన్ని తమ ఉద్యోగులు వారంలో కొన్నిరోజుల పాటు ఆఫీసుకు రావటం తప్పనిసరి చేశాయి

By:  Tupaki Desk   |   16 Feb 2024 10:30 AM GMT
వారానికి 3 రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులపై చర్యలు.. హెచ్ సీఎల్ వార్నింగ్
X

కరోనాతో మొదలైన వర్కు ఫ్రం హోం కొన్నేళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొంతకాలంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరటం తెలిసిందే. అయినప్పటికీ కొందరు ఆసక్తిని చూపకపోవటం తెలిసిందే.

దీంతో.. దిగ్గజ సంస్థలు కొన్ని తమ ఉద్యోగులు వారంలో కొన్నిరోజుల పాటు ఆఫీసుకు రావటం తప్పనిసరి చేశాయి. తాజాగా ఆ బాటలోకి వచ్చింది దిగ్గజ టెక్ సంస్థ హెచ్ సీఎల్ టెక్నాలజీస్. ఇంతకాలం ఆఫీసుకు రాకున్నా ఫర్లేదన్నట్లుగా వ్యవహరించిన ఈ సంస్థ.. తమ సంస్థలోని 80 వేల మంది డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పని చేస్తున్నారు. వారంతా వారంలో మూడు రోజుల పాటు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇందుకు ఫిబ్రవరి 19ను డెడ్ లైన్ గా విధించింది. దీనికి సంబంధించి డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పని చేస్తున్న వారికి మోమోలు పంపటం గమనార్హం. ఉద్యోగులు తమకు కేటాయించిన ఆఫీసులకు హాజరుకావాలని.. కనీసం మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల రోస్టర్ వివరాల్ని మేనేజర్లు పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని పేర్కొంది. ట్రైనింగ్ లో భాగంగా పని చేసే ఫ్రెషర్లు మాత్రం వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చిన వైనం మారిన పరిస్థితులకు నిదర్శమని చెబుతున్నారు.

ఒకవేళ ఎవరైనా సంస్థ మార్గదర్శకాలకు ఉల్లంఘిస్తే మాత్రం.. అనధికారిక గైర్హజరీగా పరిగణిస్తామని వెల్లడించింది. అలాంటి వారిపై కంపెనీ పాలసీకి అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కరోనా సమయంలో వర్కు ఫ్రం హోం ద్వారా పెద్ద ఎత్తున ఉత్పాదకతను పొందినప్పటికీ.. కంపెనీలు సంత్రప్తి కరంగా లేవు. దీనికి తోడు ప్రభుత్వాల నుంచి వస్తున్న ఒత్తిడితోనూ ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. మరికొన్ని కంపెనీలు మాత్రం.. ఉద్యోగులు ఇంట్లో ఉండి పని చేయటం ద్వారా వర్కు కల్చర్ మిస్ అవుతుందన్న విషయాన్ని గుర్తించాయి. దీంతో.. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న విషయాన్ని తప్పనిసరి అన్నట్లుగా గత ఏడాది నుంచి షురూ చేశాయి. తాజాగా హెచ్ సీఎల్ లోని 80 వేల మంది ఉద్యోగులకు ఆఫీసుకు రావాల్సిందేనన్న మార్గదర్శకాల్ని విజారీ చేసింది.