Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీ ఎఫెక్ట్‌: న‌టి హేమ అరెస్టు

బెంగ‌ళూరులో గ‌త వారం జ‌రిగిన రేవ్ పార్టీ కేసుకు సంబంధించి తెలుగు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు హేమ‌ను బెంగ ళూరు పోలీసులు అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 1:42 PM GMT
రేవ్ పార్టీ ఎఫెక్ట్‌: న‌టి హేమ అరెస్టు
X

బెంగ‌ళూరులో గ‌త వారం జ‌రిగిన రేవ్ పార్టీ కేసుకు సంబంధించి తెలుగు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు హేమ‌ను బెంగ ళూరు పోలీసులు అరెస్టు చేశారు అని అంటున్నారు . రేవ్ పార్టీలో పాల్గొన‌డంతోపాటు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టుగా హేమ‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే..ఈ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు తొలుత హేమ వాటిని ఖండించారు. తాను హైద‌రాబాద్‌లోనే ఉన్న‌న‌ని.. త‌న‌కు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు. త‌న ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్న‌ట్టు సెల్పీ వీడియోలు కూడా పెట్టారు.

అయితే..బెంగ‌ళూరు సీసీ బీ(సెంట్ర‌ల్ క్రైమ్ బ్యూరో) పోలీసులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునిఈ రేవ్ పార్టీపై కూలంక‌షంగా విచార‌ణ చేప‌ట్టిన త‌ర్వాత‌. న‌టి హేమ ఈ పార్టీలో పాల్గొన్న‌ట్టు నిర్ధారించారు. అంతేకాదు.. ఆమె కూడా డ్ర‌గ్స్ తీసుకు న్న‌ట్టు కూడా వార్తలు వచ్చాయి . దీంతో విచార‌ణ‌కు రావాలంటూ.. ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే.. తాను అనారోగ్యంతో ఉన్నాన‌ని.. ఇప్పుడు రాలేన‌ని గ‌త వార‌మే హేమ చెప్పారు. దీంతో మ‌రోసారి బెంగ‌ళూరు పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయినా... ఆమె స్పందించ‌లేదు.

దీంతో సోమ‌వారం నేరుగా బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన పోలీసులు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను బెంగ‌ళూరుకు త‌ర‌లించేందుకు స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచారు. ఇదిలావుంటే.. ఈకేసులో ప‌లువురు ఏపీకి చెందిన వారి పేర్లు కూడా వినిపించాయి. వీరిలో ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే పోలీసుల అదుపులో ఉండ‌గా.. మిగిలిన వారు విదేశాల‌కు పారిపోయిన‌ట్టు బెంగ‌ళూరు న‌గ‌ర క‌మిష‌న‌ర్ తెలిపారు. వారి కోసం కూడా వెతుకుతున్నారు.