Begin typing your search above and press return to search.

కుంభమేళాలో తొక్కిసలాటపై హేమా మాలిని షాకింగ్ కామెంట్స్

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Feb 2025 11:53 AM GMT
కుంభమేళాలో తొక్కిసలాటపై హేమా మాలిని షాకింగ్  కామెంట్స్
X

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలో... గత నెల 29న కుంభమేళలోని మౌనీ అమావాస్య రోజున తెల్లవారుజామున భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో సుమారు 30 మంది చనిపోగా.. దాదాపు 60 మందివరకూ తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా మరిగణించిన యోగి సర్కార్... దీనిపై జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని ఆరోపించింది.

మరోపక్క ఈ తొక్కిసలాట ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. కుంభమేళాలో జరుగుతున్న విషయాల గురించి చెబుతున్న సర్కార్.. తొక్కిసలాట ఘటనలో జరిగిన విషయాలను ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికీ ఈ ఘటనలో చనిపోయినవారి సంఖ్య విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అఖిలేష్ యాదవ్... యోగి సర్కార్ ఈ మరణాలను దాచిపెడుతుందని అన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉంటే.. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని.. ఇదే సమయంలో కుంభమేళా బాధ్యతల్ని ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోపక్క.. ఈ ఘటనపై జయాబచ్చన్ స్పందించారు.

ఇందులో భాగంగా... తొక్కిసలాట అనంతరం శవాలను నదిలోకి విసిరేశారంటూ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా త్రివేణీ సంగమం పూర్తిగా కాలుష్య కూపంగా మారిపోయిందని తెలిపారు. ఈ సమయంలో బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. మరణాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అవును... కుంభమేళా ఘటనలో 30 మంది చనిపోవడం స్పందించిన బీజేపీ ఎంపీ హేమామాలిని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని అంటూనే.. ఇది అంత పెద్ద సంఘటన కాదు.. దీన్నీ అతిశయోక్తి చేసి చెబుతున్నారు.. కుంభమేళా ఘనంగా జరుగుతోంది.. చాలా మంది వస్తున్నారు అని తెలిపారు.

సమాజ్ వాదీ పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. దీంతో.. హేమామాలిని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఒక్కరు గాయపడినా అది తప్పే అని.. అలాంటిది 30 మంది మరణిస్తే అది అంత పెద్ద విషయం కాదని అనడం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ తారిఖ్.. హేమా మాలిని కుంభమేళాలో వీఐపీ ట్రీట్ మెంట్ తో పాల్గొన్నారని.. అక్కడ పరిస్థితులు బాగా దిగజారిపోయాయని.. ఇక్కడ పోలీసులు, అధికారులు వీఐపీల కోసమే చూస్తున్నారని.. సామాన్య ప్రజల భద్రతను గాలికి వదిలేశారని.. ఆమె వ్యాఖ్యలు బాధితులను ఎగతాళి చేయడమే అని ఫైర్ అయ్యారు.